spot_img
Homeఎంటర్టైన్మెంట్Biker movie first day collections: 'బైకర్' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహించిన...

Biker movie first day collections: ‘బైకర్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చిందిగా..

Biker movie first day collections: ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న శర్వానంద్(Sharwanand), ఇప్పుడు ‘బైకర్'(Biker Movie) చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ , ఆ టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం రాలేదు. సాధారణంగా ఇలాంటి సినిమాలకు మామూలుగానే ఓపెనింగ్స్ ఉండవు , దానికి తోడు ప్రొమోషన్స్ కూడా సరిగా చెయ్యలేదు , ఇక ఓపెనింగ్స్ గురించి మర్చిపోవడమే, కనీసం కోటి రూపాయిల షేర్ అయినా వస్తుందా అని అనుకున్నారు. ఎందుకంటే పోటీ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ‘రాకాస’ చిత్రం కూడా ఉంది కాబట్టి. కానీ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేస్తూ డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.

వచ్చిన పాజిటివ్ టాక్ కి తగ్గ ఓపెనింగ్ కాకపోయినప్పటికీ, పర్వాలేదు , వీకెండ్ వరకు ఈ చిత్రం ఎలాంటి డోకా లేకుండా ఆడేస్తుంది అనే గట్టి నమ్మకాన్ని ట్రేడ్ వర్గాలకు ఇచ్చింది ఈ చిత్రం. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకు కలిపి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. షేర్ పరంగా చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 50 లక్షల రూపాయిలు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ జానర్ చిత్రానికి ఈ మాత్రం ఓపెనింగ్ రావడం గొప్పే. కాస్త ప్రొమోషన్స్ బలంగా చేసుంటే ఇంకా ఎక్కువ వచ్చేవేమో.

Also Read: ‘రాకాస’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఓపెనింగ్స్ తోనే 50 శాతం బ్రేక్ ఈవెన్..

ఓవరాల్ గా ఈ చిత్రానికి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ వేల్యూ బిజినెస్ 21 కోట్ల రూపాయలకు జరిగింది. వీకెండ్ పూర్తి అయ్యేసరికి 6 నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉంటే అసలు సరిపోదు, సోమవారం నుండి ఈ చిత్రం డీసెంట్ హోల్డ్ ని కనబర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే స్పీడ్ తో పోతే కనీసం 5 కోట్ల నష్టం తప్పేలా లేదు. ఇకపోతే రెండవ రోజు బుక్ మై షో యాప్ టికెట్ సేల్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ప్రస్తుతానికి గంటకు 2100 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. సాయంత్రం షోస్ నుండి పికప్ ఉంటుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular