Neha Sharma
Neha Sharma: మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన బీహార్ బ్యూటీ నేహా శర్మను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చరణ్ అరంగేట్రం చేసిన చిరుత చిత్రంలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. ఆమెకు కూడా ఇది డెబ్యూ మూవీ. 2007లో చిరుత విడుదలైంది. పొగరు కలిగిన రిచ్ గర్ల్ పాత్రలో నేహా శర్మ నటన ఆకట్టుకుంది. రామ్ చరణ్-నేహా శర్మ మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. చిరుత హిట్ టాక్ తెచ్చుకుంది.
నెక్స్ట్ నేహా శర్మ అప్పుడు ఫార్మ్ లో వరుణ్ సందేశ్ తో జతకట్టింది. కుర్రాడు టైటిల్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అంతగా ఆడలేదు. కుర్రాడు అనంతరం నేహా శర్మ తెలుగులో కనిపించలేదు. ఆమె పూర్తిగా బాలీవుడ్ కి పరిమితమైంది. హిందీ ఎక్కువగా చిత్రాలు చేసిన నేహా, ఒకటి రెండు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. హిందీలో కూడా ఆమె ఒక స్థాయి హీరోయిన్ కాలేకపోయింది.
ప్రస్తుతం డిజిటల్ సిరీస్లపై కన్నేసింది. ఇల్లీగల్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఇది 2021లో విడుదల కాగా వూట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇల్లీగల్ సిరీస్లో నేహా లాయర్ పాత్ర చేయడం విశేషం. అలాగే షైనింగ్ విత్ ది శర్మాస్ టైటిల్ తో మరో వెబ్ సిరీస్ చేసింది. ఇది గత ఏడాది విడుదలైంది. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా నేహా శర్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈమె ఫోటోల కోసం మీడియా వెనుకబడుతూ ఉంటారు. జిమ్ ఫిట్ లో నాచురల్ బ్యూటీ తెలిసేలా ఫోటోగ్రాఫర్స్ కి ఫోజులిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు పోస్టులు చూస్తే చెమటలు పట్టాల్సిందే. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా నేహా శర్మ డీప్ కట్ జాకెట్ ధరించి హాట్ క్లీవేజ్ అందాలతో మతులు పోగొట్టింది. నేహా శర్మ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.