https://oktelugu.com/

Rajashekhar: ఫుల్ గా తాగి శివాలయానికి రాజశేఖర్ వెళ్లాడా? ఎంత నిజం..?

రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన ఎక్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో రాజశేఖర్ మన ముందుకు వచ్చారు. ఇక ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన చేసిన ఒక పని గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 28, 2023 2:21 pm
    Rajashekhar

    Rajashekhar

    Follow us on

    Rajashekhar: హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన సత్తా చాటారు. గతంలో ఈయన నటించే చాలా సినిమాలు హిట్ ను సొంతం చేసుకున్నాయి. అప్పట్లో కుటుంబ సినిమాలు అంటే రాజశేఖర్ ఉండేవారు. అలాంటి పేరు సంపాదించిన ఈ హీరో ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్ గా మిగిలిపోయారు. ఈయన ప్రస్తుతం హీరోగా చేసిన సినిమాలు హిట్ అవకపోవడం, దర్శక నిర్మాతలు హీరోగా ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోతున్నారు.

    రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన ఎక్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో రాజశేఖర్ మన ముందుకు వచ్చారు. ఇక ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన చేసిన ఒక పని గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వందేమాతరం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో డాక్టర్ గా పనిచేశారు. హీరోగా పరిచయం అవకముందు డైరెక్టర్ గా చేశారు. డాక్టర్ వృత్తి చేస్తున్న రాజశేఖర్ తండ్రి కోరిక మేరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన జీవితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమెను పెళ్లి చేసుకునే కంటే ముందే మరో అమ్మాయిని ప్రేమించారట ఈ హీరో.

    ఆమె రాజశేఖర్ ప్రేమను అంగీకరించకపోవడంతో ఒకరోజు తాగి ఒక బాధలో మునిగిపోయారట. అప్పుడే తన స్నేహితుడు వచ్చి శివాలయానికి వెళ్లి నీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుంది అని సలహా ఇచ్చారట. ఆయనకు ఎక్కువగా నమ్మకం లేకపోయినా స్నేహితుడు చెప్పాడని వెంటనే శివాలయానికి వెళ్లారట. ఫుల్ గా తాగి ఉన్న రాజశేఖర్ మరో నిమిషం ఆలోచించకుండా వెంటనే శివాలయానికి వెళ్లి తన మనుసులో ఉన్న కోరికను కోరుకున్నారట. ఇక ఆయన ప్రేమించిన అమ్మాయి రెండు రోజులకే తన ప్రేమను అంగీకరించిందని చెప్పుకొచ్చారు. కానీ ఇలా మందుతాగి గుడికి వెళ్లడం ఏంటని చాలా మంది విమర్శిస్తున్నారు.