
Biggboss 5 Telugu: ప్రతాపం నీదా నాదా అంటూ బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు రెండు జట్లుగా విడిపోయి ఒకరికి ఒకరు సవాలు విసురుకుంటు నువ్వంటే నువ్వు అంటూ పోటా పోటీ గా ఆడుతున్నారు.
హౌస్ మేట్స్ అంతా రెండు జట్లు గా విడిపోయారు. కిందా మీద ఒకరిమీద ఇంకొకరు పడుతూ ఆడ మగ అని తేడా లేకుండా సమానం గా ఆడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నరు. మధ్యలో సిరి మరియు సన్నీ మధ్య వాగ్వాదం నెలకున్నప్పటికి ఆటను ముందుకు అయితే కొనసాగించారు.
Team 🦅 ఈగల్
శ్రీరామ చంద్ర
షణ్ముఖ్ జస్వంత్
సిరి
విశ్వ
ప్రియ
హమీద
లోబో
ప్రియాంక సింగ్
ఆనీ మాస్టర్
Team 🐺 వోల్ఫ్
మానస్
నటరాజ్ మాస్టర్
ఉమ
వి. జే సన్నీ
కాజల్
శ్వేతా వర్మ
రవి
లహరి
జెస్సీ
మరీ ముఖ్యం గా హౌస్ లోనున్న 19 మంది కంటెస్టెంట్స్ తమ ఆట తీరుని బాగా కనబరిచారు. బిగ్ బాస్ హౌస్ లో రెండవ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ శ్వేతా వర్మ, ఉమా దేవి, నటరాజ్ మాస్టర్, కాజల్, లోబో, ప్రియాంక సింగ్ మరియు ఆని మాస్టర్ లు తమ ప్రతిభను కనిబరచి ఆడియెన్స్ ని మెప్పించి ఎలిమినేషన్స్ బారి నుండి తప్పించుకోవాలని గట్టిగ ప్రయత్నిస్తున్నారు.
హోరా హోరీగా సాగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో శ్రీరామ చంద్ర నేతృత్వంలోని టీమ్ ఈగల్ గెలిచింది. మొత్తానికి రెండు రోజులు ఆసక్తికరంగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఇంక ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇంక టీమ్ ఈగల్స్ లో నుండి ఎవరు రెండవ వారం బిగ్ బాస్ హౌస్ రెండవ కెప్టెన్ అవుతారో చూడాలి.