Chandrababu: చంద్రబాబుకు హైకోర్టులో మళ్లీ షాక్

సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు ఆగస్టు 4న చిత్తూరు జిల్లా అంగళ్లులో పర్యటించారు. ఆ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై పోలీసులు కేసులు పెట్టారు.

Written By: Dharma, Updated On : September 14, 2023 3:22 pm

Chandrababu

Follow us on

Chandrababu: స్కిల్ స్కామ్ తో పాటు ఇతరత్రా కేసులు సైతం చంద్రబాబును వెంటాడుతున్నాయి. దీంతో వాటి నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కోర్టులో ఊరట దక్కడం లేదు. స్కిల్ స్కాం నుంచి బయటపడినా మిగతా కేసుల్లో కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అటువంటి దానికి అవకాశం ఇవ్వకూడదని.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. అయినా కోర్టు కరుణించడం లేదు. విచారణను వాయిదా వేయడంతో చంద్రబాబుకు ఊరట దక్కడం లేదు. తాజాగా పుంగనూరు అల్లర్ల కేసుకు సంబంధించి చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు ఆగస్టు 4న చిత్తూరు జిల్లా అంగళ్లులో పర్యటించారు. ఆ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై పోలీసులు కేసులు పెట్టారు. ఏ 1 నిందితుడిగా చంద్రబాబును. మిగతా 20 మంది వరకు టిడిపి నాయకులు ముందస్తు బెయిల్ పిటీషన్లను దాఖలు చేసి.. తీసుకున్నారు. చంద్రబాబు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

చంద్రబాబు పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో పోలీసులు పూర్తి వివరాలు సమర్పించకపోవడంతోనే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కిల్ స్కాం కేసుకు సంబంధించి చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే… అంగళ్ళ కేసులో చంద్రబాబును కస్టడీకి కోరాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగానే కోర్టుకు వివరాలు అందించలేదని తెలుస్తోంది.