https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: అరుచుకుంటూ ఆరోప‌ణ‌లు చేసుకున్న కంటెస్టెంట్లు.. నామినేష‌న్స్ లో ఉన్న‌ది వీళ్లే..

Bigg Boss Telugu OTT: బిగ్‌ బాస్ రోజురోజుకూ కొత్త ట్విస్టుల‌తో సాగుతోంది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా క‌నిపించ‌న హౌస్‌ను త‌న ప్లానింగ్ తో హ‌డావిడి చేసేస్తున్నాడు బిగ్ బాస్‌. ఇక ఈ ఓటీటీ సీజ‌న్‌లో నామినేష‌న్స్ టాస్క్ చాలా ర‌ణ‌రంగంలాగానే సాగుతోంది. అప్ప‌టి వ‌ర‌కు ఫ్రెండ్స్ గా ఉన్న వారు కూడా నామినేష‌న్స్ టాస్క్ వ‌చ్చే స‌రికి బ‌ద్ధ శ‌త్రువులు అయిపోతున్నారు. ఇక తొమ్మిదో వారం కూడా ఇలాంటి ట్విస్టులు చాలానే క‌నిపించాయి. ఈ వారం […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 26, 2022 / 01:15 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: బిగ్‌ బాస్ రోజురోజుకూ కొత్త ట్విస్టుల‌తో సాగుతోంది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా క‌నిపించ‌న హౌస్‌ను త‌న ప్లానింగ్ తో హ‌డావిడి చేసేస్తున్నాడు బిగ్ బాస్‌. ఇక ఈ ఓటీటీ సీజ‌న్‌లో నామినేష‌న్స్ టాస్క్ చాలా ర‌ణ‌రంగంలాగానే సాగుతోంది. అప్ప‌టి వ‌ర‌కు ఫ్రెండ్స్ గా ఉన్న వారు కూడా నామినేష‌న్స్ టాస్క్ వ‌చ్చే స‌రికి బ‌ద్ధ శ‌త్రువులు అయిపోతున్నారు. ఇక తొమ్మిదో వారం కూడా ఇలాంటి ట్విస్టులు చాలానే క‌నిపించాయి.

    Bigg Boss Telugu OTT

    ఈ వారం కాస్త డిఫ‌రెంట్ గా నామినేష‌న్స్ టాస్క్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్‌. ఇందుకోసం దిష్టిబొమ్మ‌ల ప్లాన్ చేశాడు. అంటే కంటెస్టెంట్స్ కి దిష్టిబొమ్మ‌లు ఇచ్చి వాటిపై కుండ‌ల‌ను పెట్టాడు. ఎవ‌రినైతే నామినేట్ చేయాల‌ని అనుకుంటారో.. వారి కుండ‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌న్న‌మాట‌. ఇంకేముంది కంటెస్టెంట్లు ఎవ్వ‌రూ త‌గ్గ‌కుండా తెగ రెచ్చిపోయారు.

    Also Read: KGF-3 Story: కేజీఎఫ్-2ను మించి కేజీఎఫ్-3 ఉండబోతుందా? వైరల్ పిక్..!

    వారం రోజులుగా దాచుకున్న కోపాన్ని మొత్తం చూపించేశారు. అయితే అఖిల్ కెప్టెన్ కావ‌డంతో అత‌ను నామినేష‌న్స్ నుంచి త‌ప్పించుకున్నాడు. కానీ అత‌నికి నామినేట్ చేసే అవ‌కాశం ఉండ‌టంతో ఏ మాత్రం ఆలోచించుకుండా యాంకర్ శివ, హమీదలను నామినేట్ చేసేశాడు. ఈ క్ర‌మంలో మ‌రోసారి బాత్రూమ్ ర‌చ్చ న‌డిచింది.

    Bigg Boss Telugu OTT

    వీరి గొడ‌వ అయిపోగానే.. అరియానా వ‌చ్చి నటరాజ్ మాస్టర్ ను ఏరికోరి నామినేట్ చేసేసింది. ఇంకేముంది ఆయ‌న ఊరుకుంటారా.. ఎప్ప‌టిలాగే ఫైర్ అయిపోయాడు. లేనిపోని ఆరోప‌ణ‌లు అన్నీ చేసేశాడు. గేమ్ ఆడట్లేద‌ని, ఎమోష‌న‌ల్ దెబ్బ కొడుతోందంటూ చెప్పాడు. ఆ త‌ర్వాత హ‌మీద‌ను కూడా నామినేట్ చేసింది అరియానా.

    ఇక యాంక‌ర్ శివ త‌న కోపాన్ని అఖిల్ మీద చూపించే ఛాన్స్ లేక‌పోవ‌డంతో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ మీద చూపించాడు. అత‌న్ని నామినేట్ చేశాడు. అలాగే మిత్రాశర్మను కూడా కొన్ని కార‌ణాలు చెప్పి నామినేష‌న్‌లో పెట్టేశాడు. దీంతో మిత్రాశ‌ర్మ గ‌ట్టిగా అరిచేసింది. త‌న‌లోని ఆవేద‌న‌న‌ను అంతా చూపించింది.

    వీరి వాద‌న‌లు ముగిసిన త‌ర్వాత హమీద టైమ్ వ‌చ్చింది. ఇంకేముంది త‌న‌ను నామ‌నేట్ చేసిన అరియానాపై రివేంజ్ తీర్చుకోవ‌డం కోసం ఆమెను నామినేట్ చేస్తున్న‌ట్టు చెప్పింది. అలాగే న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌ను కూడా వ‌ద‌ల్లేదు. ఇక అఖిల్ బ్యాచ్ లోని అషురెడ్డి కూడా శివను టార్గెట్ చేసింది. ఎంతైనా అఖిల్ ఫాలోవ‌ర్ అని నిరూపించుకుంది. ఆ త‌ర్వాత బాబా భాస్క‌ర్‌ను కూడా నామినేట్ చేసేసింది.

    Bigg Boss Telugu OTT

    ఇక హ‌మీద బాట‌లోనే మిత్రాశర్మ కూడా త‌న‌ను నామినేట్ చేసిన యాంకర్ శివను, త‌ర్వాత బిందు మాధవిని నామినేట్ చేస్తూ.. కొన్ని కార‌ణాలు చెప్పేసింది. నటరాజ్ మాస్టర్, బాబా మాస్టర్ లను నామినేట్ చేశాడు అనిల్. ఫైర్ బ్రాండ్ బిందు మాధవి త‌న క్లోజ్ ఫ్రెండ్ యాంక‌ర్ శివ‌ను నామినేట్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చింది. త‌ర్వాత మిత్రశర్మను నామినేట్ చేస్తున్న‌ట్టు చెప్పేసింది. చివ‌ర‌గా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ వ‌చ్చేసి అనిల్, అరియానాలను నామినేట్ చేస్తున్న‌ట్టు చెప్పాడు. ఇలా ఒకిరి మీద ఒక‌రు అరుచుకుంటూ ఆరోప‌ణ‌లు చేసుకుంటూ నామినేష‌న్ టాస్క్‌ను ముగించారు. చివ‌ర‌కు మిత్రాశర్మ, అరియనా, నటరాజ్ మాస్టర్, శివ, బాబా భాస్కర్, హమీద, అనిల్ నామినేష‌న్స్ లో ఉన్నారు. ఈ సారి టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్లు అంద‌రూ సేఫ్ జోన్‌లోనే ఉన్నారు.

    Also Read:Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !

    Recommended Videos:

    Tags