Congress President Sonia Gandhi: దేశంలోని అయిదు రాష్ట్రాల్లో దారు;ణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం మొదలైంది. పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషించారు. భవిష్యత్ లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై అంచనా వేసింది. ఈ మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు వెలువరించారు. పార్టీ భవిష్యత్ దృష్ట్యా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
సమావేశానికి జీ23 నేతల్లో భాగస్వాములైన గులాం నబీ ఆజాద్, మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ లు కూడా హాజరయ్యారు కరోనా పాజిటివ్ రావడంతో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ, అనారోగ్య కారణాల రీత్యా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గైర్హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టమ్ నిర్వహించారు. పార్టీపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. వ్యక్తులకన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా? కీలక ప్రకటనకు రంగం సిద్ధం!
పార్టీ భవిష్యత్ దృష్ట్యా గాంధీ కుటుంబంపై వస్తున్న ఆరోపణలతో తాము అధికారానికి దూరంగా ఉంటామని సోనియాగాంధీ ప్రకటించగా నేతలందరు ఆమె నేతృత్వానికే మద్దతు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం సోనియాగాంధీయే అధ్యక్షురాలుగా ఉండాలని ప్రతిపాదన చేసింది. దీంతో సోనియాగాంధీ అభ్యర్థిత్వానికి అందరు మొగ్గు చూపడం విశేషం. మరోవైపు రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని సభ్యులందరు కోరారు. సోనియాగాంధీ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో నేతల ప్రతిపాదనను సోనియా ఓకే చేశారు.
ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామా చేస్తామని సోనియాగాంధీ చెప్పడంతో అందరు తిరస్కరించారు. సోనియాగాంధీ వ్యాఖ్యలపై సభ్యులందరు అభ్యంతరం వ్యక్తం చేసి అధ్యక్షురాలుగా కొనసాగాలని అభ్యర్థించారు. పార్టీకి త్వరలో పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ పూర్తిస్థాయిలో పోరాడి అధికారం హస్తగతం చేసుకునే విధంగా నాయకత్వం మారాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది.
Also Read: పవన్ స్టార్ గానే కాదు, వ్యక్తిగానూ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడు !