Bigg Boss Telugu 8: సోనియా ని మాస్ ర్యాగింగ్ చేసిన నబీల్,యష్మీ..అదిరిపోయే పాయింట్స్ నోటికి తాళం వేశారు!

నబీల్ మాట్లాడుతున్న సమయంలో ఆమె ఓవర్ ల్యాప్ చేసే ప్రయత్నం చేయగా, నబీల్ ఆమెని వెక్కిరిస్తూ తెగ ట్రోల్ చేస్తాడు. దీనికి మండిపోయిన సోనియా నబీల్ కి 'ఫెయిల్డ్ సంచాలక్' అనే ట్యాగ్ లైన్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత యష్మీ కూడా సోనియా ని చాలా బలమైన పాయింట్స్ తో నామినేట్ చేస్తుంది.

Written By: Vicky, Updated On : September 24, 2024 8:22 am

Bigg Boss Telugu 8(40)

Follow us on

Bigg Boss Telugu 8: తనకి తానుగా ఆడపులి అని చెప్పుకొని మొదటి ఎపిసోడ్ నుండే ప్రమోట్ చేసుకున్న కంటెస్టెంట్ సోనియా. ఈమె మాట్లాడే సమయంలో ఈమె నోటి దూలకు ఎవరు నిలబడలేరు, క్రాస్ టాక్ చేసి డామినేట్ చేసేయాలి అని ప్రతీ కంటెస్టెంట్ పై ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఈమెకి సరైన కంటెస్టెంట్స్ బలమైన గొంతుతో మాట్లాడితే ఆడ పులి కాస్త ఆడ పిల్లి లాగా మారిపోతుంది. నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఎపిసోడ్ లో ఇదే జరిగింది. ఈరోజు నబీల్ ఈమెని మాస్ లెవెల్ లో ర్యాగింగ్ చేసాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నబీల్ ఇచ్చిన కౌంటర్స్ కి సమాధానం చెప్పలేక సోనియా ముఖం మాడిపోయింది అని చెప్పొచ్చు.

ముందుగా ఆమె నబీల్ ఆమెని నామినేట్ చేస్తూ ‘సంచాలక్ గా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయ్యినట్టు నాకు అనిపించింది, బెలూన్స్ టాస్క్ లో అభయ్ అన్ని సార్లు గీత దాటి బయటకి వచ్చినప్పుడు అతన్ని మీరు సంచాలక్ గా గేమ్ నుండి తప్పించేసి ఉంటే అయిపోయేది. చివరి వరకు కొనసాగించారు, అది నాకు నచ్చలేదు అని అంటాడు. ఇక రెండవ పాయింట్ నేను సంచాలక్ గా వ్యవహరిస్తున్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ‘బయాసిడ్’ అని అన్నావు,అంతే కాకుండా ‘అందుకే చదువుకొని రావాలి’ అని నువ్వు నన్ను వ్యక్తిగతంగా అన్నట్టుగా అనిపించింది. ఇక చివరి పాయింట్ ఏమిటంటే నేను మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు నా మీద అరిచారు, నేను కూడా అదే విధంగా మాట్లాడాను. ఇంతలోపే నిఖిల్, పృథ్వీ నా మీదకు వచ్చేసారు. నేను మిమ్మల్ని అంటే వాళ్ళిద్దరికీ ఏమి అవసరం, సంబంధం లేకుండా వాళ్ళు ఎందుకు వచ్చారు?, మీరు అప్పుడైనా చెప్పాల్సింది వెళ్ళండి అని’ అంటూ చెప్పుకొచ్చాడు నబీల్. దీనికి సోనియా చాలా పొగరుగా సమాదానాలు ఇవ్వడం మొదలు పెట్టింది.

నబీల్ మాట్లాడుతున్న సమయంలో ఆమె ఓవర్ ల్యాప్ చేసే ప్రయత్నం చేయగా, నబీల్ ఆమెని వెక్కిరిస్తూ తెగ ట్రోల్ చేస్తాడు. దీనికి మండిపోయిన సోనియా నబీల్ కి ‘ఫెయిల్డ్ సంచాలక్’ అనే ట్యాగ్ లైన్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత యష్మీ కూడా సోనియా ని చాలా బలమైన పాయింట్స్ తో నామినేట్ చేస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘మీ క్లాన్ లో నువ్వు మా మీదకు నిఖిల్, పృథ్వీ ని దాడి చేయమని పంపిస్తావు, కానీ నువ్వు మాత్రం రాలేవు. వాళ్ళిద్దరిని నువ్వు ఆయుధాలు లెక్క వాడుకుంటున్నావు’ అని అనేస్తుంది. దీనికి సోనియా ఇచ్చిన కారణం చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే. ఆమె మాట్లాడుతూ ‘నేను ఫిజికల్ టాస్క్ లోకి అడుగుపెడితే పృథ్వీ కంటే దారుణంగా ఆడుతాను. నేను ఆ ఊపులో కంటెస్టెంట్స్ ని కొట్టినా కొట్టేస్తాను, అందుకే నేను రాలేదు. నేను ఫిజికల్ అయితే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు’ అంటూ చెప్పుకొస్తుంది సోనియా. ఈమె ఫిజికల్ టాస్కులు ఆడలేక పృథ్వీ ని తన ఆయుధం లాగా వాడుతుంది అనేది ఆడియన్స్ అందరికీ అర్థమైంది .కానీ నామినేషన్స్ లో ఆమె దానిని ఎలా కవర్ చేసుకుందో చూడండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.