Bigg Boss Akhil And Bindu Madhavi: బుల్లితెర ప్రేక్షకులకు విపరీత వినోదాన్ని పంచిన బిగ్ బాస్ షో ప్రస్తుతం ఓటీటీ వేదికగా సాగుతోంది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ పేరుతో ప్రసారం అవుతున్న ఈ షో లో కంటెస్టెంట్లు హంగామా చేస్తున్నారు. గతంలో లాగే గొడవలు, చీదరింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. 17 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఇందులో ఇప్పటికే 8 మంది ఎలిమినేట్ అయ్యారు. ఉన్నవారిలో టాప్ లో బిందుమాదవి, అఖిల్ లు ఫస్ట్, సెకండ్ ప్లేసులో కొనసాగుతున్నారు. నిర్వాహకులు చెప్పిన టాస్క్ లను వీరిద్దరు పోటీపడి పూర్తి చేస్తున్నారు. అందుకే మిగతా వారి కంటే వీరు టాప్ ప్లేసులో కొనసాగుతున్నారు. తాజాగా బిందు మాధవి ఒకడుగు ముందుకేసి రచ్చ చేసింది. ఓ సీన్లో చేయి కోసుకుంటానని బెదరించింది… అంతేకాకుండా ముద్దు, ముచ్చట్లతో ఫన్నీ సీన్స్ పండించింది.
గతంలో కంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఎక్కువ మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో పాత సీజన్లలో చేసినవారు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్లలో సీనియర్లు బయటకొచ్చారు. ఉన్నవారిలో బిందు మాధవి దూసుకుపోతుంది. ఓటీటీలోనూ ఇంత రంజుగా షో సాగుతుందని ఎవరూ ఊహించలేదు. గత వారం నుంచి షో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తి పెరిగింది. మొన్నటి వరకు సాదాసీదాగా సాగిన ఈ షో ప్రస్తుతం కంటెస్టెంట్ల మధ్య పోటీ వాతావరణం నెలకొనడంతో ఊపందుకుంది. ముఖ్యంగా బిందుమాధవి, అఖిల్ సార్థక్ ల మధ్య నిత్యం పోటా పోటీ వార్ సాగుతోంది.

తాజాగా ఓ టాస్క్ లో యాంకర్ శివను సపోర్టు చేయడానికి బిందు మాధవి కాస్తా హద్దులు దాటింది. దీంతో అఖిల్ సార్థక్ స్టాండ్ మార్చి శివకు వ్యతిరేకంగా మారారు. దీంతో బిందుమాధవి, అఖిల్ ల మధ్య పోటీ నెలకొంది. ఇద్దరి మధ్య గొడవ అయింది. మొదటి నుంచే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతుండగా.. తాజాగా ఈ యుద్ధం మరింత పెద్దదైంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్కులు సాగుతున్నాయి. ఇందు కోసం మొదటి రోజు మాజీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో ఆటాడుకుంది. ఆ తరువాత మానస్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కూడా కొన్ని టాస్క్ లు ఇచ్చాడు. మరి కొందరు మాజీ కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: Rahul Gandhi Visit Telangana: ఉద్యమగడ్డ ఓయూపై రగిలించే కాంగ్రెస్ ప్లాన్ ఫెయిల్ అయ్యిందే?
ఇదిలా ఉండగా.. టాప్ ప్లేసులో కొనసాగుతున్న బిందు మాధవి తాజాగా రెచ్చిపోయింది. అఖిల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నం తింటుడగా… ఆ వెనుకాల సోఫాలో అనిల్ రాథోడ్, యాంకర్ శివ, బిందు మాధవిలు కూర్చొని అతడిపై జోకులు వేసుకుంటున్నారు. అప్పుడే బిందు మాధవి.. అఖిల్ కోసం ‘చేయి కోసుకుంటా’ అని కత్తి పట్టుకొని హల్ చల్ చేసింది. ఆ తరువాత జోక్ అన్నట్లు ఫన్నీ మూమెంట్ ఇచ్చింది.

తనపై జోకులు వేస్తున్న బిందు మాధవిని అఖిల్ లైట్ తీసుకున్నాడు. ఏమాత్రం పట్టించుకోనట్లు నవ్వుకుంటూ ఉన్నాడు. భోజనం చేస్తున్న అఖిల్ తనపై జోకులేసిన బిందు మాధవికి గోరుముద్దలు తినిపించేందుకు ముందుకు వచ్చాడు. కానీ బిందు మాధవి ఏమాత్రం వద్దనకుండా గోరుముద్దలను నోట్లో పెట్టుకుంది. దీంతో అక్కడున్న యాంకర్ శివ, అనిల్ రాథోడ్ లు షాకయ్యారు. ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలాగా గొడవపడే వీరిద్దరిని ఇలా చూసేసరికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పాత పగలన్నీ మరిచిపోయి వీరిద్దరూ ఒక్కటి కావడాన్ని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే వీరిద్దరి మధ్య చనువు ఇలాగే ఉంటుందా..? కేవలం ఈ సందర్భం కోసం ఇలా చేశారా? తరువాత వార్ కంటిన్యూ అవుతుందా..? అనేది ఆసక్తిగా మారింది..
Also Read: RRR OTT Release Date: మే 20 నుంచి ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్.. కానీ ఒక షరతు !
[…] […]