Bigg Boss Telugu 9 Agnipariksha Navdeep: బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లోకి సామాన్యులను పంపే ప్రక్రియ లో భాగాంగా నిర్వహించిన అగ్ని పరీక్ష(Agnipariksha) షో లో ఎందుకో న్యాయ నిర్ణేతలు సరిగా తమ తీర్పుని అందించడం లేదనే భావన చూస్తున్న ఆడియన్స్ లో కలుగుతుంది. తాము ముందుకు పంపాలన్న కంటెస్టెంట్స్ నే వాళ్ళు ముందుకు పంపిస్తున్నారు కానీ, నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం లోపలకు పంపడం లేదనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతుంది. మొదట్లో నవదీప్ చాలా మంచిగా అనిపించాడు కానీ, ఈమధ్య కాలం లో ఆయన కూడా కాస్త అతి చేస్తున్నట్టు గా అనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు, సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న ఆయన వ్యవహరించిన తీరు ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. మరీ అంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదని నవదీప్ తీరుని చూసిన తర్వాత అంటున్నారు. కానీ నిన్న జరిగిన ఈ వ్యవహారం లో దమ్ము శ్రీజా ప్రేక్షకుల మనసు దోచుకుంది.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న శ్రీముఖి అగ్ని పరీక్ష టాస్కు లో భాగంగా కల్కి మరియు షాకిబ్ ని స్టేజి మీదకు పిలుస్తుంది. ఈ టాస్కు మొదలయ్యే ముందు ఒకరు స్టూడియో బయట ఉండాలని చెప్తుంది. ముందుకు షాకిబ్ నేను వెళ్తాను అని బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీముఖి కల్కి కి టాస్కుని వివరిస్తూ నీ స్నేహితుల సర్కిల్ లో ఎవరికో ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగాలి అని అంటుంది. ఇదే టాస్కుని షాకిబ్ కి కూడా ఇస్తాము, మీ ఇద్దరిలో ఎవరి అకౌంట్ కి ఎక్కువ డబ్బులు వస్తాయో, వాళ్ళు ఈ టాస్క్ గెలిచినట్టు, టాప్ 15 లోకి అడుగుపెడతారు అని అంటుంది. ఇక ఆ తర్వాత కల్కి తన స్నేహితులకు ఫోన్ చేసి అర్జెంటు గా 90 వేల రూపాయిలు పంపమని అడుగుతుంది. ఆమె స్నేహితుడు 10 నిమిషాలు సమయం అడిగి 50 వేల రూపాయిలు ముందుగా పంపిస్తాడు.
ఇది అయిపోయిన తర్వాత షాకిబ్ ని లోపలకు పిలుస్తారు. అతనికి కల్కి కి చెప్పినంత వివరంగా, మీ ఇద్దరిలో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, వాళ్ళే విన్నర్ అనే విషయాన్నీ వివరించదు శ్రీముఖి. దీంతో షాకిబ్ తన స్నేహితుడికి ఫోన్ చేసి కేవలం 10 వేల రూపాయిలు అడుగుతాడు. ఆ పది వేల రూపాయిలు అతనికి వెంటనే వస్తుంది. అప్పుడు షాకిబ్ తో శ్రీముఖి మాట్లాడుతూ ‘ఆమె ఎంత డబ్బులు అడిగిందని నువ్వు అనుకుంటున్నావు’ అని అంటుంది. అప్పుడు షాకిబ్ 30 వేలు అని అంటాడు. మరి నువ్వెందుకు కేవలం 10 వేలు మాత్రమే అడిగావు అని అడగ్గా, నేను కేవలం అకౌంట్ డబ్బులు పడితే చాలు అనుకున్నాను అని అంటాడు, అప్పుడు శ్రీముఖి షాకిబ్ కి మరో అవకాశం ఇస్తుంది. ఇక్కడే షాకిబ్ కి ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్లే గెలుస్తారు అనే విషయం అర్థం అయ్యుండాలి. నవదీప్ కూడా ఎక్కువ డబ్బులు ఉంటేనే విన్ అనే హింట్ ఇస్తాడు. అప్పుడు షాకిబ్ తన చెల్లి కి ఫోన్ చేసి ఎంత డబ్బులు నీ దగ్గర ఉంటే అంతా నాకు పంపేయమని అడుగుతాడు, ఆమె 50 వేలు పంపుతుంది, అదే విధంగా కల్కి కి కూడా తన స్నేహితుడి నుండి మిగిలిన 40 వేల రూపాయిలు వచ్చేస్తుంది. ఆ విధంగా కల్కి ఈ టాస్క్ గెలిచి టాప్ 15 లోకి వెళ్తుంది.
అయితే ఈ ప్రక్రియ లో ముందుగానే శ్రీముఖి షాకిబ్ కి కూడా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్లు విన్నర్ అనే విషయాన్నీ చెప్పి ఉండుంటే మొదటిసారి ఆయన ఎక్కువ డబ్బులు అడిగి ఉండేవాడు. శ్రీముఖి అందుకే అతనికి రెండవ అవకాశం ఇచ్చింది కానీ, ముందే ఈ విషయాన్ని చెప్పి ఉండుంటే షాకిబ్ ఎక్కువ డబ్బులు అడిగేవాడు కదా. చివర్లో శ్రీముఖి ఈ టాస్క్ లో మేము న్యాయంగా వ్యవహరించాము అని అనుకున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి అని అంటుంది. దమ్ము శ్రీజా తప్ప ఎవ్వరు చేతులు పైకి ఎత్తరు. చివర్లో నవదీప్ శ్రీజా ని పిలిచి ఎందుకు అలా అన్నావు? అని అడుగుతాడు. అప్పుడు శ్రీజా కల్కి కి ఎక్కువ డబ్బులు అడగాలి అనే క్లారిటీ స్పష్టంగా ఇచ్చారు, కానీ షాకిబ్ కి ఆ క్లారిటీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు నవదీప్ అసలు ఏమి జరిగిందో మొత్తం చెప్తాడు, అక్కడి వరకు బాగానే ఉంది, కానీ మల్లి దమ్ము శ్రీజా మాట్లాడి ఉండుంటే ఆ తన పాయింట్ ని ఇంకా స్పష్టంగా చెప్పేది కదా. కానీ నవదీప్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు, ఆమె మాట్లాడుతున్నప్పుడు కట్ చేసి, వెళ్లి కూర్చో ఇక అని బలవంతగా పంపేస్తాడు. సామాన్యులు అయినంత మాత్రానా అంత బలుపుతో వాళ్ళతో మాట్లాడాలా?, కొన్ని లక్షల మంది ఈ ప్రోగ్రాం ని చూస్తున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం మంచిది కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. అయితే అంత మంది ముందు ధైర్యం చేసి తనకు న్యాయం గా అనిపించింది మాట్లాడడానికి ప్రయత్నం చేసిన దమ్ము శ్రీజా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆడియన్స్.