Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లోకి సామాన్యులను పంపే ప్రక్రియ లో భాగంగా ‘అగ్ని పరీక్ష'(Agnipariksha) అనే షో ని నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులు నుండి రోజుకో ఎపిసోడ్ చొప్పున ఈ షో జియో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతుంది. మొదటి మూడు రోజులు ఎలా జరిగింది అనే విషయం కాసేపు పక్కన పెడితే, నాల్గవ రోజు నుండి మాత్రం అసలైన అగ్నిపరీక్ష మొదలైంది అనిపించింది. వివిధ రకాల టాస్కులు ఆడుతూ నిన్న సామాన్యులంతా తమ సత్తా ని చాటారు. ముఖ్యంగా వీళ్ళలో మనం మాట్లాడుకోవాల్సింది, అభినందించాల్సింది మాస్క్ మ్యాన్ హరీష్, అదే విధంగా దమ్ము శ్రీజా. ఆడిషన్స్ సమయం లో వీళ్లిద్దరు ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. మాస్క్ మ్యాన్ ని చాలా బలుపు యాటిట్యూడ్ ఉన్నోడు అనుకున్నారు, అదే విధంగా దమ్ము శ్రీజా ని చూస్తేనే చిరాకొస్తుంది అనే రేంజ్ లో ఉన్నారు.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
కానీ నిన్న వీళ్లిద్దరు బిగ్ బాస్ కోసం ఏమి చేయడానికైనా రెడీ అన్నట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు శభాష్ అనిపించాయి. మొదటి టాస్క్ గా నవదీప్ మాస్క్ మ్యాన్ ని స్టేజి మీదకి పిలుస్తాడు. నీకు పోటీ ఎవరో నువ్వే ఎంచుకో అని అంటాడు. మాస్క్ మ్యాన్ సింగర్ శ్రీతేజ్ పేరు చెప్తాడు, కానీ నవదీప్ మాత్రం సాయి కృష్ణ ని ఎంచుకుంటాడు. ఇద్దరు స్టేజి మీదకు వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన ట్రిమ్మర్ తో ముఖం మొత్తానికి సగానికి ట్రిమ్ చేసుకోవాలి, అదే లుక్ తో ఈ షో పూర్తి అయ్యే వరకు, అదే విధంగా బిగ్ బాస్ హౌస్ లో కూడా కొనసాగాలి అని అంటాడు. ఈ టాస్క్ చేయడం ఇష్టం లేని వాళ్ళు చేయలేము అని చెప్పి వెళ్లి కూర్చోవచ్చు, కానీ మొదలు పెట్టిన తర్వాత ఆపితే మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోవాలి అనే షరతు పెడుతారు.
అందుకు ఇద్దరు ఒప్పుకుంటారు, ఈ విషయం లో సాయి కృష్ణ ని కూడా మనం మెచ్చుకోవాలి. నవదీప్ రెడీ, స్టార్ట్ అనగానే మాస్క్ మ్యాన్ వేగంగా ట్రిమ్మర్ ని అందుకొని సగానికి తన ముఖాన్ని ట్రిమ్ చేసుకొని టాప్ 15 కి వెళ్లి కూర్చుంటాడు. ఇక దమ్ము శ్రీజా గురించి మాట్లాడుకోవాలి, ఈమెను మరియు ఊర్మిళ అనే అమ్మాయిని స్టేజి మీదకు పిలుస్తుంది శ్రీముఖి. వీళ్లిద్దరికీ నుదిటి మీద ‘ఐ యామ్ ది లూజర్’ అని టాటూ ని వేయించుకోవాలని అంటుంది శ్రీముఖి. ఊర్మిళ నా వల్ల కాదు అని తప్పుకుంటే, దమ్ము శ్రీజా మాత్రం నేను రెడీ అంటుంది. టాటూ అంటే జీవితాంతం చెరిగిపోనిది, బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్తామో లేదో కూడా తెలియదు, అయినప్పటికీ కూడా నుదిటి మీద అలాంటి టాటూ వేయించుకోడానికి సిద్ధపడడం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ శ్రీముఖి కేవలం వీళ్ళు ఏమంటారో అని టెస్ట్ మాత్రమే పెట్టింది కానీ, నుదిటి మీద కాకుండా చేతి మీద ‘ఐ లవ్ బిగ్ బాస్’ అనే టాటూ ని వేసుకోమని చెప్పింది. దమ్ము శ్రీజా వేసుకొని టాప్ 15 కి వెళ్ళిపోయింది. ఇలా వీళ్లిద్దరు తమ సత్తాని చాటారు.