https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నిన్న పృథ్వీ-విష్ణు..నేడు నిఖిల్- యష్మీ..బిగ్ బాస్ హౌస్ లో బ్రేకప్ అవుతున్న లవ్ స్టోరీలు!

నామినేషన్స్ లో అందరూ పృథ్వీ ని విష్ణు ప్రియతో లింక్ చేస్తూ నామినేషన్స్ వేయడం, అది హౌస్ లో పెద్ద టాపిక్ అవ్వడం వంటి సంఘటనలు జరిగాయి. దీనికి యష్మీ పృథ్వీ తో మాట్లాడుతూ వాళ్ళకే కాదు, మాకు కూడా అలాగే అనిపిస్తుంది, నీకు విష్ణు మీద ఏ ఫీలింగ్ లేకపోతే వెళ్లి ఆమెకు క్లారిటీ గా చెప్పు అని అంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 / 08:44 AM IST

    Bigg Boss Telugu 8(152)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు మొత్తం పృథ్వీ, నిఖిల్ వెంట పడుతుండడం మనమంతా మొదటి వారం నుండి చూస్తూనే ఉన్నాం. సోనియా ఉన్నన్ని రోజులు ఆమె నిఖిల్, పృథ్వీ తో స్నేహంగా ఉండడం హౌస్ లో అమ్మాయిలకు ఎవరికీ నచ్చేది కాదు. ఆమీ ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఆమె ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో లవ్ ట్రాక్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా విష్ణు ప్రియ మొదటి నుండి పృథ్వీ పై ఫీలింగ్స్ ని చూపిస్తూ, అతనికి ప్రపోజ్ కూడా చేసిన సందర్భాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ పృథ్వీ మాత్రం, నాకు ఈ హౌస్ లో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు, నేను సింగిల్ గా ఉన్నాను, అలాగే ఉంటాను కూడా అని చెప్తాడు. అయినప్పటికీ కూడా విష్ణుప్రియ పృథ్వీ వెనుక తిరుగుతూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది.

    మొన్న నామినేషన్స్ లో అందరూ పృథ్వీ ని విష్ణు ప్రియతో లింక్ చేస్తూ నామినేషన్స్ వేయడం, అది హౌస్ లో పెద్ద టాపిక్ అవ్వడం వంటి సంఘటనలు జరిగాయి. దీనికి యష్మీ పృథ్వీ తో మాట్లాడుతూ వాళ్ళకే కాదు, మాకు కూడా అలాగే అనిపిస్తుంది, నీకు విష్ణు మీద ఏ ఫీలింగ్ లేకపోతే వెళ్లి ఆమెకు క్లారిటీ గా చెప్పు అని అంటుంది. అప్పుడు పృథ్వీ విష్ణు ప్రియ వద్దకు వెళ్లి నా మీద నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నట్టు అయితే ఇక్కడితో కట్ చేద్దాం మన రిలేషన్ ని అని అంటాడు. దీనికి విష్ణు ప్రియ హార్ట్ బ్రేక్ అవుతుంది. అలా చెప్పినా కూడా ఆమె పృథ్వీ వెంటే తిరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. అయితే హౌస్ లో యష్మీ కి నిఖిల్ అంటే ఇష్టం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె అతన్ని తన డ్రీం బాయ్ గా అనుకుంది, ఈ విషయం నిఖిల్ కి కూడా తెలుసు. అప్పటి నుండి నిఖిల్ యష్మీ తో లిమిట్స్ దాటకుండా ఉంటాడు.

    నిన్న యష్మీ నిఖిల్ వద్దకు వచ్చి నువ్వు నాతో అసలు మాట్లాడడం లేదు, స్నేహితులం గా ఉన్నప్పుడే బాగా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు నిఖిల్ మాట్లాడితే మళ్ళీ నువ్వు ఎక్కువ ఆశలు పెంచేసుకుంటావేమో అని అంటాడు. దానికి యష్మీ అంత సినిమా లేదు, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా, ఎదో నువ్వు నా డ్రీం లోకి వచ్చావ్ కాబట్టి చెప్పా అంతే, ఒకరంటే పడి చచ్చిపోయే రేంజ్ కాదు నేను అని అంటుంది. అప్పుడు నిఖిల్ ఆ మాత్రం క్లారిటీ ఉంటే పర్వాలేదు అని అంటాడు. నా వల్ల నీ గేమ్ అసలు డిస్టర్బ్ అవ్వడానికి నేను ఇష్టపడను, ఈరోజు నుండి కేవలం ఒక ఫ్రెండ్ గానే నీతో మాట్లాడుతాను, చూస్తూ ఉండు అని చెప్పి యష్మీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా హౌస్ రెండు ప్రేమ జంటలు విడిపోయాయి, రాబోయే రోజుల్లో వీళ్ళు మళ్ళీ కలవొచ్చు కూడా.