https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హిస్టరీ లో ‘ఫ్లిప్పింగ్ స్టార్’ గా ‘యష్మీ’ ఆల్ టైం రికార్డు..5 నిమిషాల్లో ఇన్ని అబద్దాలు ఏ మనిషి ఆడలేదేమో!

పూర్తి వివరాల్లోకి వెళ్తే 'బిగ్ బాస్ ఇంటికి దారేది' టాస్కు లో ఈమె టీం కి రెండు ఎల్లో కార్డ్స్ వచ్చినప్పుడు గౌతమ్ ని తొలగించింది. అలా ఆమె తొలగించడానికి కారణం గౌతమ్ అప్పటికే మెగా చీఫ్ అయ్యాడు అని, నేను, ప్రేరణ అవ్వలేదని, అందుకే నువ్వు తప్పుకోవాల్సిందిగా గౌతమ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. అతను కూడా పెద్దగా వాదించకుండా తప్పుకుంటాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 08:59 AM IST

    Bigg Boss Telugu 8(193)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హిస్టరీ లో యష్మీ లాంటి చెత్త కంటెస్టెంట్ ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. నోటికి వచ్చినన్ని అబద్దాలు చెప్పడం, ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం, ఒకరిని మెప్పించడం కోసం మరొకరి ఎమోషన్స్ తో ఆదుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈమెలో నెగటివ్ యాంగిల్స్ కుప్పలు తెప్పలు గా ఉంటాయి. ఒక మాట మీద నిలబడి మాట్లాడడం ఈమెకు చేత కాదు, ఈరోజు ఒక మాట మాట్లాడుతుంది, రేపు మరొక మాట మాట్లాడుతుంది. అసలు ఈమె మాట్లాడిన మాటలు ఈమెకు గుర్తు ఉంటాయా అనే అనుమానాలు కూడా ఆడియన్స్ లో ఉన్నాయి. మొదటి ఎపిసోడ్ నుండి నేటి వరకు ఈమె ఇలాగే ప్రవర్తిస్తుంది. టాస్కులు ఆడాల్సిన సమయంలో చాలా బాగా ఆడుతుంది కానీ, ఇది తప్ప ఆమెలో పాజిటివ్ యాంగిల్స్ వెతుకుదాం అన్నా కనపడవు. ఇదంతా పక్కన పెడితే నిన్న నాగార్జున ముందు ఆమె వేసిన ఫ్లిప్పులకు చేతులెత్తి దండం పెట్టొచ్చు. ముఖ్యంగా ఈ వారం లైవ్ చూసినవాళ్లు అయితే యష్మీ కి ఓట్లు వేయడం కూడా ఆపేస్తారు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘బిగ్ బాస్ ఇంటికి దారేది’ టాస్కు లో ఈమె టీం కి రెండు ఎల్లో కార్డ్స్ వచ్చినప్పుడు గౌతమ్ ని తొలగించింది. అలా ఆమె తొలగించడానికి కారణం గౌతమ్ అప్పటికే మెగా చీఫ్ అయ్యాడు అని, నేను, ప్రేరణ అవ్వలేదని, అందుకే నువ్వు తప్పుకోవాల్సిందిగా గౌతమ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. అతను కూడా పెద్దగా వాదించకుండా తప్పుకుంటాడు. కానీ నిన్న నాగార్జున ముందు మాత్రం ‘గౌతమ్ మెగా చీఫ్ అయిన వారంలో చాలా కసిగా టాస్కులు ఆడాడు, నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెట్టాడు, కానీ ఈ వారం మాత్రం ఆ ఫైర్ తో ఆడలేదు అనిపించింది. అతని వల్లే చాలా టాస్కులు ఓడిపోయాము’ అంటూ చెప్పుకొచ్చింది యష్మీ. అప్పుడు గౌతమ్ వెంటనే పైకి లేచి ఈ కారణం నాకు అసలు చెప్పలేదు సార్ అని నాగార్జున తో అంటాడు. దానికి యష్మీ సమాధానం చెప్తూ ‘గౌతమ్ ఫీల్ అవుతాడని అప్పుడు నేను చెప్పలేదు సార్..ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.

    ఇది ముమ్మాటికీ పచ్చి అబద్దం, గౌతమ్ గేమ్స్ బాగా ఆడలేదు అని హౌస్ మేట్స్ అందరికీ చాటింపులు వేసింది యష్మీ. నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన వీడియో ని చూపించి ఉండుంటే చాలా బాగుండేది. అంతే కాకుండా మెగా చీఫ్ కంటెండర్ గా డైస్ గేమ్ లో ఒక అడుగు ముందు ఉన్న గౌతమ్ ని ఎందుకు తప్పించావు..?, అతను నిన్ను అక్కా అన్నది మనసులో పెట్టుకొని అలా చేసావా?, లేకపోతే నిఖిల్ తీయమన్నాడని తీసావా? అని అడుగుతాడు నాగార్జున. దీనికి యష్మీ సమాధానం చెప్తూ ‘నేను ప్రేరణ చర్చించుకున్నాం. ఈ వారం గౌతమ్ అసలు టాస్కులు బాగా ఆడలేదని ఇద్దరికీ అనిపించింది. అందుకే ఏకాభిప్రాయంతో తీసేసాం’ అని చెప్పుకొచ్చింది. కానీ అతన్ని తీసేసిన తర్వాత చెప్పిన కారణం వేరు. డైస్ గేమ్ లో ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని నాకు తెలియదు, తెలిసి ఉంటే అసలు తీసే దానిని కాదు అని చెప్తుంది యష్మీ. ఈ విషయాన్ని అసలు నాగార్జున ముందు ప్రస్తావించలేదు. ఆమె గౌతమ్ ని తొలగించడం వల్లే బస్తాల టాస్కు లో కేవలం ప్రేరణ ఒక్కటే ఈమె టీం నుండి ఆడాల్సి వచ్చింది. అదే ఈమె అతన్ని తీయకపొయ్యుంటే ఈమె టీం నుండి గౌతమ్ , ప్రేరణ ఇద్దరు గేమ్ ఆడేవాళ్లు. ఈ పాయింట్ మీద నాగార్జున కూడా మాట్లాడలేదు. కన్నడ బ్యాచ్ మొత్తం గౌతమ్ ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు అని సోషల్ మీడియా లో ఒక వాదన వినిపిస్తూ ఉండేది, దానిని నిన్న యష్మీ తన ఫ్లిప్పింగ్స్ తో నిజం చేసి చూపించింది.