https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ బూతులు కంట్రోల్ చేసుకోవడం తప్పు అంటున్న నాగార్జున..ఇదేమి దిక్కుమాలిన హోస్టింగ్ బాబోయ్!

బూతు పదం ఉపయోగించకపోతే, ఎందుకు సైలెంట్ గా పెదాలు కదిలించావు?, చాలా తెలివిగా, ఎవరికీ అర్థం కాకుండా, వాడాల్సిన పదం వాడేసావు అని అంటాడు నాగార్జున. గౌతమ్ నేను చేయని తప్పుని చేశాను అంటే నేను అసలు ఒప్పుకోను సార్, నేను నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నిజంగా బూతు పదం వాడినట్టు నిరూపించండి, ఇప్పుడే బయటకి వెళ్ళిపోతాను అని అంటాడు గౌతమ్.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 09:02 AM IST

    Bigg Boss Telugu 8(194)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకులకు అనిపించింది ఒక్కటే..నాగార్జున కి గౌతమ్ కి మధ్య బయట ఏమైనా గొడవలు ఉన్నాయా?, అందువల్లే ఆయన గౌతమ్ ఏది చేసినా తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ నిఖిల్ ని ఎదో గట్టిగా తిట్టాడు, అందుకే నిఖిల్ కోపంతో అలా రెచ్చిపోయాడు అని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పి, గౌతమ్ తప్పు చేసాడు, నిఖిల్ తప్పేమి లేదు అని చెప్పే ప్రయత్నమే నిన్న నాగార్జున చేసినట్టుగా అందరికీ అనిపించింది. నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవకి సంబంధించిన వీడియోని వేసి చూపించాడు నాగార్జున. ఆ వీడియో లో కూడా గౌతమ్ ఎలాంటి బూతు పదం వాడినట్టు కనిపించలేదు. అసలు అక్కడ గౌతమ్ ఏమి మాట్లాడాడో నిఖిల్ కి అర్థం కాలేదు, నాగార్జున కి అర్థం కాలేదు, చూసే ఆడియన్స్ కి కూడా అర్థం కాలేదు. ఆ హీట్ మొమెంట్ లో ఏదైనా బూతు వస్తే కచ్చితంగా బయటకి వచేస్తాది, కానీ గౌతమ్ ఏ బూతు పదం వాడలేదు, కానీ అతనిదే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసాడు నాగార్జున.

    బూతు పదం ఉపయోగించకపోతే, ఎందుకు సైలెంట్ గా పెదాలు కదిలించావు?, చాలా తెలివిగా, ఎవరికీ అర్థం కాకుండా, వాడాల్సిన పదం వాడేసావు అని అంటాడు నాగార్జున. గౌతమ్ నేను చేయని తప్పుని చేశాను అంటే నేను అసలు ఒప్పుకోను సార్, నేను నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నిజంగా బూతు పదం వాడినట్టు నిరూపించండి, ఇప్పుడే బయటకి వెళ్ళిపోతాను అని అంటాడు గౌతమ్. అప్పుడు నాగార్జున తన వాదనని నిజం చేసుకోవడం కోసం హౌస్ మేట్స్ కి చూపించిన వీడియో ని బట్టి గౌతమ్ ‘బ్లేబర్’ చేసినట్టు అనిపించిందా, లేదా ఉద్దేశపూర్వకంగా తిట్టినట్టు అనిపించిందా?, గౌతమ్ తప్పు లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని అడుగుతాడు. హౌస్ లో ఒక్కరు కూడా చేతులు ఎత్తరు. అదేవిధంగా షోకి వచ్చిన ఆడియన్స్ ని కూడా అడుగుతారు, వాళ్ళు కూడా చేతులు ఎత్తరు. చూసావా ఎవ్వరూ నమ్మడం లేదు, కాబట్టి నువ్వే తప్పు చేసావ్ అన్నట్టుగా గౌతమ్ ని నెగటివ్ చేసి చూపించే ప్రయత్నం చేసాడు నాగార్జున.

    ఒకవేళ గౌతమ్ బూతులు బయటకి మాట్లాడడం ఇష్టం లేక కంట్రోల్ చేసుకొని ఉండొచ్చు. అది తప్పు అవుతుందా?, మనసులో మనం ఒక వ్యక్తి గురించి వంద మాటలు అనుకుంటాం, అది పాజిటివ్ అవ్వొచ్చు, నెగటివ్ అవ్వొచ్చు, బయటకి ఆ మాటలు వదిలినప్పుడే అవతలి వ్యక్తి మనసుని నొచ్చుకునేలా చేస్తుంది. అలా చేయకుండా ఉండడమే గౌతమ్ చేసిన తప్పా..?. అంటే గౌతమ్ మనసులో కూడా ఒక వ్యక్తిని తిట్టకునే స్వాతంత్రం లేదా..?, ఇదెక్కడి న్యాయం. ఇదంతా పక్కన పెట్టి గౌతమ్ తప్పు చేసాడు అనే అనుకుందాం..కానీ ఈ వారం అతను ఒక్క గేమ్ కూడా ఆడలేదా?, టాస్కులు ఆడి ఓడిపోయిన పృథ్వీ టీం మొత్తాన్ని బాగా ఆడారు అని పొగిడారు కదా, కానీ గౌతమ్ ని ఎందుకు బాగా ఆడావు అని పొగడలేదు?..ఈ వారం కన్నడ బ్యాచ్ మొత్తం తప్పులు చేసారు. వాళ్లకి క్లాస్ పీకాడు, బాగానే ఉంది. కానీ చివరికి వాళ్ళను బుజ్జగించడానికి బాగా గేమ్స్ ఆడారు అని కవర్ చేసేసాడు. ప్రేరణ కి క్లాస్ పీకినందుకు ఆమె డల్ గా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయిన నాగార్జున, ఆమెని నవ్వించడానికి చివర్లో ప్రయత్నం చేసాడు..కానీ గౌతమ్ ని ఎందుకు అలా ప్రోత్సహించలేదు?, అతనంటే అంత చిన్న చూపు ఎందుకు అనేది ఇప్పుడు ఆడియన్స్ లో మెలుగుతున్న ప్రశ్న. ఇంత దిక్కుమాలిన హోస్టింగ్ బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.