Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ రియాలిటీ షో లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఒక్కసారిగా టాప్ రేస్ లోకి రావొచ్చు. అలా బిగ్ బాస్ సీజన్ 2 లో జరిగింది. నాల్గవ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన కౌశల్, హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఏకంగా టైటిల్ గెలుచుకొని వెళ్ళాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా అలాగే జరిగింది. సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఎలాంటి ఫేమ్ లేని సన్నీ టైటిల్ విన్నర్ గా నిలిచాడు, షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. అలా కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలాంటి అనూహ్యమైన మార్పులు వస్తుంటాయి. నిన్న జరిగిన నామినేషన్స్ లో యష్మీ విషయంలో అదే జరిగింది. మొదటి రెండు వారాలు ఈమె ఆట తీరుని చూసి, ఇదేమి బలుపు బాబోయ్, నామినేషన్స్ లోకి రాగానే బయటకి పంపేయాలి అని ఆడియన్స్ సోషల్ మీడియా లో ట్వీట్లు వేసేవారు.
కానీ నిన్నటి నామినేషన్స్ లో ఆమె మాట్లాడిన పాయింట్స్ బాగా పేలాయి. నాగ మణికంఠ ని ఆమె నిలదీసిన తీరు, ఆడపులి అంటూ రెచ్చిపోయే సోనియా ని ఎవ్వరూ అడగలేని ప్రశ్నలు అడిగి ఆమెకు మింగుడు పడకుండా చేయడంతో యష్మీ కి సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. ఆమె సోనియా తో మాట్లాడుతూ ‘నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకోని నిన్ను నా క్లాన్ లోకి ఏరికోరి తీసుకున్నాను. కానీ నువ్వు నిఖిల్, అభయ్, పృథ్వీ మీద పెట్టిన శ్రద్ధలో సగం కూడా గేమ్ మీద పెట్టలేదు. ఏదైనా టాస్కు జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్తావేమో అని నేను ఆశిస్తే, నువ్వు సంచాలక్ గా ఉంటాను అని గేమ్ ఆడకుండా తప్పించుకునే ప్రయత్నం చేసావు, నీకు ఆట మీద అసలు సీరియస్ నెస్ లేదు’ అంటూ యష్మీ సోనియా ని కడిగిపారేసింది. ఈ ఒక్క పాయింట్ ఆమె బలంగా మాట్లాడడం వల్ల నిన్న యష్మీ పేరు సోషల్ మీడియా లో మారుమోగిపోయింది. యూట్యూబ్ లో, ఫేస్ బుక్ కామెంట్స్ లో భలే పాయింట్ పట్టింది యష్మీ అంటూ ఆమెని కామెంట్స్ లో పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ఆడియన్స్.
అలాగే నాగ మణికంఠ విషయం లో కూడా నువ్వు స్నేహం పేరుతో అందరిని మోసం చేస్తున్నావు, నువ్వు ఈ హౌస్ కి చాలా డేంజర్ అంటూ నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అంతే కాదు నేను హౌస్ లో ఎన్ని రోజులైతే ఉంటానో, అన్ని రోజులు నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటా, ఎందుకంటే నువ్వు నా నమ్మకాన్ని బ్రేక్ చేసావు అని ధైర్యం గా చెప్పి నామినేట్ చేసింది. ఇలా నిన్న మంచి పాయింట్స్ తో అదరగొట్టినందుకు ఓటింగ్ టేబుల్ లో చివర్లో ఉండాల్సిన యష్మీ, ఒక్కసారిగా టాప్ 5 రేస్ లోకి వచ్చేసింది. నామినేషన్స్ పాయింట్స్ బాగానే మాట్లాడుతుంది కానీ, టాస్కులు కూడా బాగా ఆడితే యష్మీ ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగే అవకాశం ఉంటుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.