https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : మళ్ళీ నోరు జారేసిన సోనియా.. యష్మీ బట్టలపై అసభ్య వ్యాఖ్యలు.. ఏడ్చేసిన యష్మీ!

టాస్కు కోసం డ్రెస్ ని మార్చుకోమని చెప్తే నువ్వు వదిలేసావు తేలికగా, నువ్వు తేలికగా తీసుకున్నావా?, లేదా నేనా?' అని అంటుంది. అప్పుడు యష్మీ నాకు ఏది కంఫర్ట్ గా అనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుంటాను మీకు ఎందుకు అంటూ రెచ్చిపోయింది. అలా వీళ్లిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2024 / 08:13 AM IST
    Follow us on

    ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో చూడగానే అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని అనిపించిన వారిలో ఒకరు సోనియా ఆకుల. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కరోనా వైరస్’ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా చేసిందట. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. కానీ బయట ఈమె ఒక NGO సంస్థని నడుపుతూ ఎన్నో కార్యక్రమాలు చేసిందని అందరూ అంటూ ఉంటారు. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమెని చూసి అందం పరంగా చక్కగా ఉంది అని ఆడియన్స్ అనుకున్నారు కానీ, ఆమె విశ్వరూపం చూసిన తర్వాత చేతులెత్తి దండం పెట్టేసారు.

    విష్ణు ప్రియ డ్రెస్ మీద కామెంట్స్ చేయడం, ఆమె క్యారక్టర్ ని నీచంగా దిగజారేలా మాట్లాడడం, ఆమె తల్లిదండ్రులపై కామెంట్స్ చేయడం, ఇలాంటివి ఎన్నో చూసిన ఆడియన్స్ అసలు ఈమె ఏమి మనిషి రా బాబు అని అందరూ అనుకున్నారు. విష్ణు ప్రియని అడల్ట్ రేటెడ్ కామెడీ అని సంబోధించిన సోనియా, నిఖిల్ మరియు పృథ్వీ రాజ్ తో రాసుకొని, పూసుకొని తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్క రూల్స్ మాట్లాడుతుంది కానీ, అనుసరించదు అంటూ సోషల్ మీడియా ఈమె పై బోలెడన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే అందరినీ ఏడిపించే యష్మీ ని కూడా సోనియా నిన్న జరిగిన నామినేషన్స్ లో ఏడిపించేసింది అంటే సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే యష్మీ సోనియా ని తన స్నేహితురాలిగా అనుకుంది. ఆమె క్లాన్ లో ఉన్నప్పుడు సోనియా తో క్లోజ్ గానే ఉండేది. అలా మంచి రిలేషన్ ఉంది అని అనుకునేలోపు యష్మీ ని సోనియా నామినేట్ చేయడంతో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసింది. అంతే కాకుండా విష్ణు ప్రియ బట్టలపై సోనియా ఎలాంటి కామెంట్స్ అయితే చేసిందో, యష్మీ బట్టలపై కూడా ఆమె అలాంటి కామెంట్స్ చేసింది. వీటిని యష్మీ తీసుకోలేకపోయింది.

    ముందుగా యష్మీ మాట్లాడుతూ ‘మొదటి వారం నన్ను లక్ ఫ్యాక్టర్ తో చీఫ్ అయ్యాను అని అన్నారు. అప్పట్లో ఈ కామెంట్స్ పై మన మధ్య పెద్ద గొడవ జరిగింది. నేనేమి లక్ తో గెలవలేదు. మొదటి టాస్క్ నిఖిల్ తో కలిసి ఆడి గెలిచాము, అందుకే మాకు రెండవ సారి చీఫ్ టాస్కులు ఆడే అవకాశం వచ్చింది. మీలాగా తేలికగా తీసుకొని టాస్కుని వదిలేయలేదు’ అని అంటుంది. దీనికి సోనియా కౌంటర్ ఇస్తూ ‘ఎవరు గేమ్ ని తేలికగా తీసుకున్నారు. టాస్కు కోసం డ్రెస్ ని మార్చుకోమని చెప్తే నువ్వు వదిలేసావు తేలికగా, నువ్వు తేలికగా తీసుకున్నావా?, లేదా నేనా?’ అని అంటుంది. అప్పుడు యష్మీ నాకు ఏది కంఫర్ట్ గా అనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుంటాను మీకు ఎందుకు అంటూ రెచ్చిపోయింది. అలా వీళ్లిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.