https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ ముందు దొంగ ఏడుపులు ఏడ్చిన యష్మీ..ఇక్కడ కూడా అబద్దాలే..బిగ్ బాస్ హిస్టరీలో ఇలాంటి అమ్మాయి లేదు!

నిఖిల్, గౌతమ్ లతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ని నడపాలని చూసింది. కానీ ఈమె ఆటలకు పృథ్వీ రాజ్ అడ్డుకట్ట వేసాడు. వీకెండ్ ఎపిసోడ్ లో ఈమె నడిపే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ని అందరి ముందు బట్టబయలు చేసాడు. పాపం గౌతమ్ కి అప్పటి వరకు ఈమె నిఖిల్ ని ప్రేమిస్తుంది అనే విషయం తెలియదు. కేవలం నిఖిల్ లో అసూయ పుట్టించడం కోసమే ఆమె తనతో అలా ప్రవర్తించింది అనే విషయం తెలుసుకొని గౌతమ్ చాలా బాధపడ్డాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 28, 2024 / 08:15 AM IST

    Bigg Boss Telugu 8(168)

    Follow us on

    Bigg Boss Telugu 8: తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక సార్లు దొంగ ఏడుపులు ఏడ్చిన కంటెస్టెంట్, అలాగే ఎక్కువ అబద్దాలు ఆడిన కంటెస్టెంట్ క్యాటగిరీలలో అవార్డు ఇవ్వాల్సి వస్తే యష్మీ కి ఇచ్చేయొచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 8 వారాలు నుండి ఈమెని జనాలు అనే సంఘటనలలో చూస్తూనే ఉన్నారు, ఒక్క సంఘటనలో కూడా ఈమె స్థిరమైన నిర్ణయం తీసుకోవడం చూడలేదు. సంచాలక్ గా ఉన్నప్పుడు అలాగే ప్రవర్తించింది, మణికంఠ విషయంలోనూ అలాగే ప్రవర్తించింది. పాపం అతన్ని ఈమె హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎలా అవమానించిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఒక విధంగా మణికంఠ గ్రాఫ్ అంతలా పెరగడానికి ఈమెనే కారణం. ఫ్రెండ్ అని చెప్పి నామినేట్ చేసాడని, అతన్ని అనరాని మాటలు అన్న ఈమె, చివరికి తన ఫ్రెండ్ ప్రేరణ ని నామినేట్ చేయాలనీ అనుకుంది. మణికంఠ విషయంలో అంతలా బాధపడిన నువ్వు, నీ స్నేహితురాలిని ఎలా నామినేట్ చేయాలనీ అనుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో ఈమెపై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకతని చూపించారు నెటిజెన్స్.

    ఇక ఇప్పుడు నిఖిల్, గౌతమ్ లతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ని నడపాలని చూసింది. కానీ ఈమె ఆటలకు పృథ్వీ రాజ్ అడ్డుకట్ట వేసాడు. వీకెండ్ ఎపిసోడ్ లో ఈమె నడిపే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ని అందరి ముందు బట్టబయలు చేసాడు. పాపం గౌతమ్ కి అప్పటి వరకు ఈమె నిఖిల్ ని ప్రేమిస్తుంది అనే విషయం తెలియదు. కేవలం నిఖిల్ లో అసూయ పుట్టించడం కోసమే ఆమె తనతో అలా ప్రవర్తించింది అనే విషయం తెలుసుకొని గౌతమ్ చాలా బాధపడ్డాడు. ఈ విషయాన్ని విష్ణు ప్రియతో చెప్తూ ‘ఒకరిని మండించడం కోసం, నా ఎమోషన్స్ తో ఆటలు ఆదుకోవడం చాలా బాధని కలిగించింది’ అని అంటాడు. దానికి విష్ణు ప్రియా సమాధానం చెప్తూ ‘నేను మొదటి నుండి నీకు చెప్తూనే ఉన్నాను కదా..నువ్వే క్యూట్ అంటూ ఉండేవాడివి. ఆమె ప్రవర్తన చూసిన తర్వాత కూడా క్యూట్ అని అనిపించిందా నీకు అని అడిగాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా ఒక మూలాన కూర్చొని వింటూ ఏడుస్తూ ఉంటుంది యష్మీ. ఆ తర్వాత గౌతమ్ ని పిలిచి మాట్లాడుతూ ‘నువ్వు నిజంగా ఇలా అనుకుంటావ్ అని నేను ఊహించలేదు. నా ఉద్దేశ్యం అది కాదు, నాకు నిఖిల్ కి మధ్య ఏమి లేదు. కేవలం మేము స్నేహితులం మాత్రమే’ అని చెప్పుకొస్తుంది.

    ఇక్కడ కూడా పచ్చి అబద్దాలే, ఈమె నిఖిల్ ని ప్రేమిస్తున్న విషయం వాస్తవం, అది అతనితో కూడా చర్చలు జరిపింది, ప్రేరణతో కూడా ఈ విషయం గురించి మాట్లాడింది. అంత చేసిన తర్వాత కూడా ఈమె ఇంకా స్నేహితులం అని గౌతమ్ కి చెప్పడం హాస్యాస్పదం గా అనిపించింది. కానీ గౌతమ్ ఈమెని పూర్తిగా అర్థం చేసుకొని, నాకు నీ మీద ఇష్టం పోయింది, ఇక నుండి తోటి కంటెస్టెంట్ గా మాత్రమే నీకు గౌరవం ఇస్తా చెప్పి వెళ్ళిపోతాడు. ఈ అంశంపై ఈ వారం యష్మీ కి నామినేషన్స్ చాలా బలంగానే పడేలా అనిపిస్తుంది.