Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 8 వారాలు పూర్తి అయ్యింది. గత వారం లో నామినేషన్స్ లోకి ఆరు మంది ఇంటి సభ్యులు రాగా, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్ లోకి ఎవరు వస్తారు అనే దానిపై ఆడియన్స్ లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ని చాలా విన్నూతనమైన రీతిలో ప్లాన్ చేసాడు బిగ్ బాస్. మెగా చీఫ్ అయిన విష్ణు ప్రియా ని ఏకంగా 5 మందిని నామినేట్ చేసి జైలులో వేయమని చెప్తాడు బిగ్ బాస్. ఆమె 5 మందిని ఎంచుకొని జైలుకి పంపిస్తుంది. ఆ తర్వాత బయట ఉన్న హౌస్ మేట్స్, జైలులో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ ని బయటకి తీసుకొచ్చి, ఇద్దరినీ నామినేట్ చేసి జైలు లోపలకు పంపాలి. ఈ ప్రక్రియ కోసం ఒక బజర్ ఉంటుంది.
పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి ఎవరైతే ఆ బజర్ ని నొక్కుతారో, వారికి ఇద్దరిని నామినేషన్స్ నుండి సేవ్ చేసి, మరో ఇద్దరిని నామినేషన్స్ లోకి పంపే అవకాశం వస్తుంది. ఈ ప్రక్రియ గత సీజన్ లో జరగలేదు, కానీ సీజన్ 5 లో జరిగింది. ఈ ఒక్క ఎపిసోడ్ ఆ సీజన్ కి అప్పట్లో గేమ్ చేంజర్ గా మారింది. అప్పటి వరకు షణ్ముఖ్ జస్వంత్ నెంబర్ 1 స్థానంలో ఉండేవాడు. కానీ ఒక్కసారిగా సన్నీ అతన్ని క్రిందకు తోసి, టాప్ 1 స్థానం లోకి వచ్చేసాడు. చివరికి టైటిల్ కూడా అతనే గెలిచాడు. అలా ఈ సీజన్ లో కూడా ఈ నామినేషన్స్ ఎపిసోడ్ ‘గేమ్ చేంజర్’ గా మారనుందా?. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ టాప్ 5 లోకి వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల సరైన మైలేజ్ దొరకని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది టేస్టీ తేజానే. మొదటి వారం ఇతను నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఆ ఎపిసోడ్ లో తనని తాను డిఫెండ్ చేసుకున్న విధానం కి ఆడియన్స్ సెల్యూట్ చేసారు. ఆ తర్వాత అతని ఆట తీరు కూడా చాలా బాగుండడంతో ఒక మోస్తారు ఓటింగ్ తో ముందుకు సాగుతున్నాడు. ఈరోజు జరగబోయే నామినేషన్స్ ప్రక్రియలో మరోసారి ఆయన అదే విధంగా తనని తాను డిఫెండ్ చేసుకుంటే కచ్చితంగా ‘గేమ్ చేంజర్’ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
టాప్ 5 లో తన స్థానాన్ని పదిలం చేసుకునే అద్భుతమైన అవకాశం టేస్టీ తేజ కి ఈ ఎపిసోడ్ ద్వారా దక్కింది. మరి ఆయన దానిని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. మరో విషయం ఏమిటంటే విష్ణు ప్రియ తాను ప్రేమిస్తున్న పృథ్వీ ని నామినేషన్స్ లోకి పంపుతుందా..?, లేదా అతన్ని నామినేషన్స్ నుండి తప్పిస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమె నామినేషన్స్ లోకి అతన్ని పంపిస్తే ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది, అలా కాకుండా అతన్ని నామినేషన్స్ కి పంపకుండా సేవ్ చేస్తే మాత్రం విష్ణు గ్రాఫ్ మళ్ళీ ఢమాల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ విష్ణు కి కూడా చాలా ముఖ్యం, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.