https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : టాప్ 5 కంటెస్టెంట్స్ కి స్పెషల్ AV వీడియోస్ ఈ సీజన్ లో ఉండవా..? అంతకు మించిన పెద్ద ప్లానింగ్ తో బిగ్ బాస్!

గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ చాలా విభిన్నంగా సాగిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ విభిన్నమైన పద్దతిని ఆడియన్స్ పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 09:30 AM IST

    top 5 contestants

    Follow us on

    Bigg Boss Telugu 8 : గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ చాలా విభిన్నంగా సాగిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ విభిన్నమైన పద్దతిని ఆడియన్స్ పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు. గత సీజన్ తో పోలిస్తే టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా తగ్గిపోయాయి. బిగ్ బాస్ సీజన్ 7 టీం లో ఉన్నటువంటి స్టాఫ్ ఈ సీజన్ లో 90 శాతం మారిపోవడం వల్లే ఈ సీజన్ యావరేజ్ గా సాగిపోవడానికి కారణమని అంటున్నారు విశ్లేషకులు. ఈ యావరేజ్ స్టేటస్ కూడా కేవలం వైల్డ్ కార్డ్స్ వల్లనే వచ్చిందని, వాళ్ళు లేకపోతే ఈ సీజన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యేదని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రతీ సీజన్ లో కూడా చివరి వారంలో కంటెస్టెంట్స్ కి సంబంధించిన స్పెషల్ AV వీడియోలు వేసేవారు. హౌస్ లో కష్టపడి టాప్ 5 లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కి ఇది ఒక అరుదైన గౌరవం గా చెప్పుకోవచ్చు, చాలా మంది కంటెస్టెంట్స్ టైటిల్ గెలిచినా గెలవకపోయిన ఈ AV వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

    కానీ ఈ సీజన్ లో మాత్రం చివరి వారం మొదలై ఒక రోజు పూర్తి అయినా కూడా AV వీడియోలు టాప్ 5 కంటెస్టెంట్స్ కి ప్రారంభించకపోవడం గమనార్హం. అసలు ఈ వారంలో ఈ ప్రక్రియ ఉంటుందా ఉండదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న రాత్రి ఎపిసోడ్ చివర్లో వేసిన ఈరోజుటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో కూడా ఈరోజు జరగబోయే టాస్కులు గురించి చూపించారు కానీ, కంటెస్టెంట్స్ కి స్పెషల్ AV వీడియోలు చూపిస్తున్నట్టు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు. రేపటి నుండి AV వీడియోలు వేస్తారని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది కానీ, అదే సమయంలో వేరే విధంగా ఈ కంటెస్టెంట్స్ కి సంబంధించిన AV వీడియోలు ప్లాన్ చేశారనే మరో సమాచారం కూడా అందింది.

    అదేమిటంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ కి సంబంధించిన AV వీడియోలు నాగార్జున సమక్ష్యం లో, అదే విధంగా పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్ సమక్ష్యంలో ప్రత్యేకంగా వేస్తారని, లోపల మాత్రమే కాకుండా, బయట పెద్ద LED స్క్రీన్ లో కూడా వీళ్లకు సంబంధించిన AV వీడియోలు ప్లే చేస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఎపిసోడ్ ప్రారంభం లోనే ఉంటుందా, లేకపోతే ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ స్టేజి మీదకు వచ్చినప్పుడు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో అర్జున్ కళ్యాణ్, ప్రభాకర్, ఆమని వంటి వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టాస్కులు ఆడగా, నేటి ఎపిసోడ్ లో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు, సుహాసిని రాబోతున్నట్టు తెలుస్తుంది.