Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో సోలో బాయ్ గా బాగా ప్రొజెక్ట్ అయిన కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. సీజన్ 7 లో ఆయన ఇదే ట్యాగ్ తో 13 వారాలు హౌస్ లో కొనసాగాడు కానీ, టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలబడలేకపోయాడు. ఈ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి, తనలోని వైల్డ్ ఫైర్ ని బయటకి లాగి, ఒక రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి టాప్ 5 లోకి అడుగుపెట్టడమే కాదు, టైటిల్ రేస్ లో కూడా నిలిచాడు. ఇప్పుడు కప్పు కొట్టబోయేది నిఖిల్, లేదా గౌతమ్ అనే రేంజ్ లో ఆడియన్స్ లో ఒక ముద్ర వేసాడు. ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఈ రేంజ్ లో ఎదగడం అనేది హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఇతర భాషలకు సంబంధించిన బిగ్ బాస్ షోస్ లో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురు అవ్వలేదు.
ఈ విషయంలో ఎవరు అవునన్నా, కాదన్నా గౌతమ్ ని మెచ్చుకొని తీరాల్సిందే. గౌతమ్ తో పాటు నిఖిల్ కూడా టైటిల్ కొట్టేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్. ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా కన్నడ వెర్సస్ తెలుగు బ్యాచ్ అనే వాదన సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో జరిగింది. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ కి లీడ్ గా నిఖిల్ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నట్టు బాగా ప్రొజెక్ట్ అయ్యాడు. అయినప్పటికీ కూడా నిఖిల్ ఓటింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉండడం అనేది మామూలు విషయం కాదు. క్యారక్టర్ లో గోల్డ్ అనిపించుకున్న నిఖిల్, టాస్కులలో కూడా కింగ్. ఇప్పటి వరకు ఆయన ఆడిన టాస్కులన్నీ దాదాపుగా విజయం సాధించాడు. టాస్కులలో ఈ రేంజ్ సక్సెస్ స్ట్రైక్ రేట్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కి కూడా లేదు.
అయితే ఇక్కడ నిఖిల్ కి ఉన్న ఒక అడ్వాంటేజ్, గౌతమ్ కి లేదు. అదే ఆయన ఓటింగ్ గౌతమ్ మీద కాస్త ఎక్కువగా ఉండేందుకు కారణం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ప్రతీ కంటెస్టెంట్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నిఖిల్ కి ఓటు వెయ్యమని ప్రమోట్ చేస్తున్నారు. బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి యష్మీ, విష్ణు ప్రియ, పృథ్వీ రాజ్ శెట్టి, నాగ మణికంఠ వంటి వారు నిఖిల్ కి ఓటు వెయ్యమని ప్రతీ రోజు ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాకుండా గత సీజన్ లో రన్నరప్ గా నిల్చిన అమర్ దీప్ వంటి టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ కూడా నిఖిల్ కి ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నాడు. కానీ గౌతమ్ కి మాత్రం టేస్టీ తేజ తప్ప ఎవ్వరూ సహాయాం చేయడం లేదు. నిఖిల్ కి ఇంత మంది కంటెస్టెంట్స్ ఫ్యాన్ బేస్ కి సంబంధించిన ఓట్లు పడుతుండగా, గౌతమ్ కి మాత్రం తన సొంత ఫ్యాన్ బేస్ ఓట్లు మాత్రమే పడుతుంది. అలా హౌస్ లో సోలో బాయ్ గా కొనసాగిన గౌతమ్, ఓటింగ్ లో కూడా సోలో బాయ్ గానే తన సత్తా చూపిస్తున్నాడు.