https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సంచాలక్ గా ఫెయిల్ అయిన కంటెస్టెంట్ ఎవరు..? సోనియా నోరు మూసుకునేలా చేసిన యష్మీ!

యష్మీ డామినేషన్ ని తట్టుకోలేక సోనియా కూడా మాట మాట్లాడలేకపోయింది. విషయం ఏమిటంటే, ఇద్దరు బెలూన్స్ పగలగొట్టుకునే క్రమం లో చాలా వరకు బెలూన్స్ క్రింద పడి బయటకి వెళ్లిపోయాయి. అలా వెళ్లిపోయిన వాటిని సోనియా లోపలకు పంపుతానని ముందుగానే చెప్పింది. చెప్పినట్టుగానే బయటకి వెళ్లిన బెలూన్స్ ని లోపలకు పంపింది. కానీ అత్యధిక శాతం బెలూన్స్ ఆమె టీం కి సంబంధించినవే లోపలకు పంపినట్టు యష్మీ వాదించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 18, 2024 / 08:44 AM IST

    Bigg Boss 8 Telugu(42)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న రేషన్ కోసం జరిగిన టాస్కులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. గడిచిన రెండు వారాల్లో బిగ్ బాస్ పెట్టే టాస్కులపై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్స్ నడిచేవి. ఇవేమి టాస్కులు రా బాబు, చిన్న పిల్లలు ఆడుకునేవి కదా ఇవి, చూసే జనాలు అంత వెర్రివాళ్ళు లెక్క అనిపిస్తున్నారా అంటూ కామెంట్స్ చేసారు. కానీ ఈ వారం మాత్రం ప్రారంభం నుండే మంచి టాస్కులు ఇచ్చాడు. ముందుగా ఫోటో ఫ్రేమ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ తమ క్లాన్ కి సంబంధించిన చీఫ్స్ ఫోటోలను బోర్డు కు తగిలించాలి. ఎవరి ఫోటోలైతే ఎక్కువగా బోర్డు మీద ఉంటాయో, ఆ క్లాన్ విన్ అయ్యినట్టు. ఈ టాస్కులో అభయ్ టీం గెలుస్తుంది. నబీల్, పృథ్వీ ఈ టాస్కులో తలపడ్డారు. కిరాక్ సీత సంచాలక్ గా వ్యవహరించింది. సంచాలక్ గా ఆమె ఎక్కువ తప్పులు చేయలేదు కానీ, గేమ్ ని మధ్యలో చాలా సార్లు ఆపుతూ చిరాకు పుట్టించింది. బిగ్ బాస్ మధ్యలో కలగచేసుకొని గేమ్ ని మధ్యలో ఆపడానికి వీలు లేదు అని సీతకు వార్నింగ్ ఇస్తాడు.

    ఇక ఆ తర్వాత బిగ్ బాస్ రేషన్ గెలుచుకోవడం కోసం ‘నత్తలా సాగుకు..ఒక్కటి వదలకు’ అనే టాస్కు ని ఇస్తాడు. ఈ టాస్కులో నిఖిల్ టీం గెలుస్తుంది. మణికంఠ సంచాలక్ గా బాగా చేయలేదని ఆయన టీం కి సంబంధించిన వారు పెద్ద గొడవ చేసారు కానీ, నాగ మణికంఠ సంచాలక్ గా మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఇక చివరి టాస్కు గా ‘బూరని కొట్టు..రేషన్ పట్టు’ ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్కులో శరీరం మీద ఉన్న బెలూన్స్ పగలగొట్టాలి. ఎవరి ఒంటిమీద అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు టాస్కులో విన్ అవుతారు. ఈ టాస్కులో క్లాన్స్ కి చీఫ్స్ గా వ్యవహరిస్తున్న నిఖిల్, అభయ్ పోటీ పడుతారు. సోనియా సంచాలక్ గా వ్యవహరిస్తుంది. అయితే ఈ టాస్కులో సోనియా తప్పు చేసిందని, తన టీం కి అనుకూలంగా నిర్ణయం తీసుకొని చీటింగ్ చేసింది అంటూ ఆమెపై రెచ్చిపోయింది.

    యష్మీ డామినేషన్ ని తట్టుకోలేక సోనియా కూడా మాట మాట్లాడలేకపోయింది. విషయం ఏమిటంటే, ఇద్దరు బెలూన్స్ పగలగొట్టుకునే క్రమం లో చాలా వరకు బెలూన్స్ క్రింద పడి బయటకి వెళ్లిపోయాయి. అలా వెళ్లిపోయిన వాటిని సోనియా లోపలకు పంపుతానని ముందుగానే చెప్పింది. చెప్పినట్టుగానే బయటకి వెళ్లిన బెలూన్స్ ని లోపలకు పంపింది. కానీ అత్యధిక శాతం బెలూన్స్ ఆమె టీం కి సంబంధించినవే లోపలకు పంపినట్టు యష్మీ వాదించింది. అంతే కాకుండా బెలూన్ శరీరం పై మిగిలి ఉన్న అభయ్ ని కాకుండా, నిఖిల్ ని విన్నర్ గా ప్రకటించాపదం పై కూడా యష్మీ నోరు పారేసుకుంది. తనని తాను డిఫెండ్ చేసుకోవడం లో ఛాంపియన్ గా నిలిచే అలవాటు ఉన్న సోనియా, ఈరోజు యష్మీ కి బలమైన కౌంటర్లు ఇవ్వలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.