https://oktelugu.com/

Bigg Boss Telugu 8: 9వ వారం నామినేషన్స్ లోకి 5 మంది కంటెస్టెంట్స్..ఫలించిన నిఖిల్ మాస్టర్ మైండ్ గేమ్..ఓజీ క్లాన్ నుండి కేవలం ఒక్కరే!

రాయల్ క్లాన్ ని చిత్తుచిత్తుగా ఓడించారు. అలాగే నామినేషన్స్ కూడా మనలో మనం చేసుకోకూడదు, రాయల్ క్లాన్ వాళ్ళను మాత్రమే చేయాలి అని అంటాడు నిఖిల్. ఈ వారం జరిగింది కూడా అదే. ఓజీ క్లాన్ నుండి విష్ణు ప్రియ మెగా చీఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే మెగా చీఫ్ అయ్యినందుకు విష్ణు ప్రియ కి ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు బిగ్ బాస్. జైలులోకి 5 మంది కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసి పంపమంటాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 28, 2024 / 08:38 AM IST

    Bigg Boss Telugu 8(170)

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రతీ సోమవారం జరిగే నామినేషన్స్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియ లో కంటెస్టెంట్స్ మధ్య వాదనలు, గొడవలు తారాస్థాయిలో జరుగుతాయి. గత వారం ఈ ప్రక్రియ చాలా హీట్ వాతావరణం లో జరిగింది. ఈ వారం కూడా అదే స్థాయిలో జరిగిందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఈ వారం నామినేషన్స్ లోకి గౌతమ్, యష్మీ, టేస్టీ తేజ, హరి తేజ, నయనీ పావని వచ్చారు. ఇందులో యష్మీ తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ రాయల్ క్లాన్ కి సంబంధించిన వాళ్ళే అవ్వడం గమనార్హం. గత వారం నిఖిల్ ఓజీ క్లాన్ కి బలంగా చెప్తాడు. కప్ కొడితే మన ఆరుగురిలో ఎవరో ఒకరు కొట్టాలి, రాయల్ క్లాన్ వాళ్ళని మాత్రం కప్పు ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. అతను చెప్పినట్టే గత వారం టాస్కులు చాలా ఫైర్ మీద ఆడారు ఓజీ క్లాన్.

    రాయల్ క్లాన్ ని చిత్తుచిత్తుగా ఓడించారు. అలాగే నామినేషన్స్ కూడా మనలో మనం చేసుకోకూడదు, రాయల్ క్లాన్ వాళ్ళను మాత్రమే చేయాలి అని అంటాడు నిఖిల్. ఈ వారం జరిగింది కూడా అదే. ఓజీ క్లాన్ నుండి విష్ణు ప్రియ మెగా చీఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే మెగా చీఫ్ అయ్యినందుకు విష్ణు ప్రియ కి ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు బిగ్ బాస్. జైలులోకి 5 మంది కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసి పంపమంటాడు. ప్రక్రియ ఆమెతోనే మొదలైంది కాబట్టి ఆమె క్లాన్ కోసమే ఆలోచిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే గత వారం ఆమె నిఖిల్ మాటలకు ఏకీభవించకుండా, నేను ఈ వారం క్లాన్ అని అలోచించి నామినేషన్స్ వేయకుండా ఉండలేను, నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి జనాలకు తెలిసేలా నామినేషన్ వేయాలి అని అంటుంది. కాబట్టి ఆమె లిస్ట్ లో యష్మీ, ప్రేరణ ఉంటుంది. కచ్చితంగా ఆమె ఎంచుకున్న 5 మందిలో వీళ్లిద్దరు ఉంటారు. మిగిలిన ముగ్గురు రాయల్ క్లాన్ నుండి ఉంటారు.

    అయితే జైలు బయట ఉన్న కంటెస్టెంట్స్ బజర్ మోగించి ఇద్దరు కంటెస్టెంట్స్ ని సేవ్ చేసి, మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ని జైలులోకి పంపి నామినేట్ చేయాలి. ఈ ప్రక్రియలో ఓజీ, రాయల్ క్లాన్స్ ప్రేరణ ని సేవ్ చేసారు, యష్మీ ని బలి చేసారు. యష్మీ ని ఓజీ క్లాన్ నుండి ఒక్కరు కూడా సేవ్ చేయాలనీ అనుకోలేదా? అనేది నేటి ఎపిసోడ్ ని చూసాక అర్థం అవుతుంది. గత వారం మొత్తం యష్మీ నెగటివ్ కంటెంట్ ఇస్తూ వచ్చింది. ఆమె గ్రాఫ్ బాగా తగ్గిపోయి ఉంటుంది, కానీ ఆమె లక్ ఏమిటంటే ఈ వారం నామినేషన్స్ లోకి రాయల్ క్లాన్ వాళ్ళు రావడమే. వాళ్లకు ఈమె కంటే తక్కువ ఓటింగ్ ఉంటుంది, కాబట్టి నామినేషన్స్ లోకి వచ్చిన సేవ్ అయిపోతుంది.