https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : సీత విషయంలో విష్ణు ప్రియా ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా..ఈమె ఆడలేదు..ఆడవాళ్ళని ఆడనివ్వదు!

నేడు సీతతో ఆమె పడిన గొడవ చూస్తే అదే అనిపించింది. పిక్ ది ఐటెం టాస్కులో సీత మరియు నాగ మణికంఠ పోటీ పడగా, సీత ఈ టాస్కులో గెలుస్తుంది. టాస్కులో గెలిచినందుకు ఆమెని మెచ్చుకోవాల్సింది పోయి, నాగ మణికంఠ నిన్ను గట్టిగా అలా తోస్తుంటే నువ్వెందుకు తోయించుకున్నావ్, నువ్వు కూడా తోయాల్సింది కదా, చాలా తేలికగా తీసుకున్నావ్ ఆ టాస్కుని, ఎదో మన అదృష్టం బాగుండడం వల్ల ఆ టాస్కు గెలిచాము అని సీత మీద విష్ణు ప్రియా అరిచింది

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 09:02 AM IST

    Big Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఇప్పటి వరకు ఈమె కేవలం అమాయకత్వం తోనే నెట్టుకొస్తోంది. టాస్కులో ఎదో ఆడమంటే ఆడుతుంది కానీ, డిబేట్స్ లో తనని తాను డిఫెండ్ చేసుకోవడంలో ఈమె చాలా వీక్ అనేది అర్థం అవుతుంది. బలంగా మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా, అవసరం లేని చోట నోరు పెద్దది చేసి మాట్లాడుతూ తింగరి బుచ్చి అని ఆడియన్స్ చేత అనిపించుకుంటుంది. నేడు సీతతో ఆమె పడిన గొడవ చూస్తే అదే అనిపించింది. పిక్ ది ఐటెం టాస్కులో సీత మరియు నాగ మణికంఠ పోటీ పడగా, సీత ఈ టాస్కులో గెలుస్తుంది. టాస్కులో గెలిచినందుకు ఆమెని మెచ్చుకోవాల్సింది పోయి, నాగ మణికంఠ నిన్ను గట్టిగా అలా తోస్తుంటే నువ్వెందుకు తోయించుకున్నావ్, నువ్వు కూడా తోయాల్సింది కదా, చాలా తేలికగా తీసుకున్నావ్ ఆ టాస్కుని, ఎదో మన అదృష్టం బాగుండడం వల్ల ఆ టాస్కు గెలిచాము అని సీత మీద అరుస్తుంది.

    దీనికి సీత వాదిస్తూ ఎలా ఆడితే ఏంటి?, గెలిచానా లేదా?, నువ్వు ఇలా మాట్లాడుతుంటే గెలిచిన ఆనందం క్షణం కూడా లేకుండా పోతుంది నాకు అంటూ చెప్పుకొస్తుంది సీత. అలా వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ చాలా సిల్లీ గా అనిపించింది. విష్ణు ప్రియా అనవసరంగా మాట్లాడింది అని చూసేవాళ్లకు అనిపించింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అంశంపై ఆమె మీద ట్రోల్ల్స్ విపరీతంగా పడుతున్నాయి. విష్ణు ప్రియా ఒక్క టాస్కు కూడా సీరియస్ గా ఆడదు, ఆడినా కూడా గెలవలేదు, అలాంటి ఆమె గెలిచే వాళ్ళ మీద ఏడవడం హాస్యాస్పదం అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఇన్ని రోజులు జరిగిన అన్ని టాస్కులలో ఈరోజు విష్ణు ప్రియా కాస్త బాగా ఆడింది అని అనిపించింది. మొదట స్విమ్మింగ్ పూల్ లో దూకే టాస్కులో అందరికంటే ముందు దూకి 25 వేల రూపాయిలు గెలుచుకుంటుంది విష్ణు ప్రియా. ఆ తర్వాత సాక్స్ టాస్కులో కూడా తన బెస్ట్ ట్రై చేసింది. మొత్తం మీద ఇన్ని రోజులకు ఈమెకు టాస్కుల పట్ల సీరియస్ నెస్ వచ్చిందని అంటున్నారు నెటిజెన్స్. ఈ వారం ఈమె నామినేషన్స్ లో ఉంది. ఓటింగ్ లైన్ లో ప్రస్తుతం అందరి కంటే టాప్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఈమె మాత్రమే. ఈ సీజన్ మొత్తం ఆమె ఆడకపోయినా కూడా టాప్ 5 వరకు రాగలదు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమె సొంతం, కానీ టాస్కులు ఇలా సీరియస్ గా ఆడితే నెంబర్ 1 టైటిల్ రేస్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, చూడాలి మరి ఎంతవరకు ఈమె నెట్టుకొని రాగలదు అనేది.