https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : 13వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళే..ఈ వారం డబుల్ ఎలిమినేషన్..డేంజర్ జోన్ లో ఆ నలుగురు!

గత వారం ఓజీ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు నామినేషన్స్ లోకి రాగా యష్మీ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By: , Updated On : November 25, 2024 / 02:14 PM IST
Bigg Boss Telugu 8: These are the contestants who entered the nominations in the 13th week..double elimination this week..those four are in the danger zone!

Bigg Boss Telugu 8: These are the contestants who entered the nominations in the 13th week..double elimination this week..those four are in the danger zone!

Follow us on

Bigg Boss Telugu 8 : గత వారం ఓజీ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు నామినేషన్స్ లోకి రాగా యష్మీ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ చాలా మందికి బాధగా అనిపించింది. ఎందుకంటే టాప్ 5 లోకి వెళ్లగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్, ఎంటర్టైన్మెంట్ తో పాటు, బోలెడంత టీఆర్ఫీ కంటెంట్ ఇచ్చింది ఈమె. టాస్కులు కూడా ఆడపులి లాగా రెచ్చిపోయి మరీ ఆడింది. కానీ చివరికి నిఖిల్ ప్రేమలో పడి తన గేమ్ మొత్తాన్ని డౌన్ చేసుకొని ఇప్పుడు ఎలిమినేట్ అయ్యింది. ఇది ఇలా ఉండగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ప్రేరణ, గౌతమ్, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్ నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో నిఖిల్, గౌతమ్ నబీల్ తప్ప, మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అయితే ఈ వారం కూడా హౌస్ లో అందరూ గౌతమ్ ని టార్గెట్ చేసారు.

మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉంటే, అందులో 5 మంది గౌతమ్ కి ఓటు వేశారు. నబీల్ అయితే అర్థం పర్థం లేని పాయింట్స్ తో గౌతమ్ ని నామినేట్ చేసి జోకర్ గా మారిన పరిస్థితి ఏర్పడింది. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ని గమనిస్తే నబీల్, గౌతమ్ మధ్య పెద్ద ఫైట్ జరగడం మనం చూసాము. ఈ ప్రోమో లో నబీల్ కి గౌతమ్ ఇస్తున్న కౌంటర్లు వేరే లెవెల్ లో ఉన్నాయి. అదే విధంగా పృథ్వీ అవినాష్ ని నామినేట్ చేయడం కూడా మనం చూసాము. వీళ్లిద్దరి మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. ప్రతీ వారం లాగానే, ఈ వారం కూడా నామినేషన్స్ గ్రూపిజం ని తలపించాయి. స్వయంగా హోస్ట్ కూడా గ్రూపిజం ని ప్రోత్సాహం చేసినప్పుడు, ఇక కంటెస్టెంట్స్ మాత్రం ఎందుకు తగ్గుతారు చెప్పండి.

పాయింట్స్ లేకపోయినా వెట్టుకొని మరీ సిల్లీ పాయింట్స్ తో ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. వీళ్ళ తీరుని చూస్తుంటే, వీళ్లకు గత వారం లో లాగానే పాత కంటెస్టెంట్స్ తో నామినేట్ చేయించడం ఉత్తమం అని అనిపిస్తుంది. అయితే ఈ వారం ఓటింగ్ లోని చివరి రెండు స్థానాల్లో అవినాష్, టేస్టీ తేజా ఉండే అవకాశాలు ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ పెడితే వీళ్లిద్దరు ఎలిమినేట్ అవ్వొచ్చు. యష్మీ ఎలిమినేట్ అయ్యింది కాబట్టి ఆమెకు వచ్చే ఓట్లు ప్రేరణ కి పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేరణ టాప్ 4 లో ఉండొచ్చు. నబీల్ గత వారం లోనే డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు వార్తలు వినిపించాయి. ఈ వారం ఆయన నామినేషన్స్ లోకి వచ్చి ఉండుంటే, ఆయన కూడా డేంజర్ జోన్ లో ఉండే అవకాశాలు ఉండేవి. కానీ అదృష్టం కొద్దీ తప్పించుకున్నాడు. గత వారం రోహిణి పడినట్టు సాలిడ్ ఎపిసోడ్ అవినాష్, టేస్టీ తేజలకు పడితే తప్ప, వాళ్ళను ఎలిమినేట్ కాకుండా ఎవ్వరూ ఆపలేరని విశ్లేషకుల అభిప్రాయం.