Maharashtra Election Result: ప్రజల అభిరుచులు, అభిప్రాయాలు మారుతున్నాయి. ప్రజా తీర్పుల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో అధికారపక్షం తో పాటు విపక్షానికి ప్రజలు అవకాశం ఇచ్చేవారు. కానీ ఈ ధోరణి మారుతోంది.చాలా రాష్ట్రాల్లో కనీసం విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన బలం ఇవ్వడం లేదు ప్రజలు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోదారుణంగా ఓడిపోయింది వైసీపీ. కూటమి ఏకపక్షంగా 164 స్థానాల్లో విజయం సాధించింది.వైసిపి 11 స్థానాలకు పరిమితం అయింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. 10 శాతం సీట్లు ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఈ లెక్కన వైసీపీకి ఆ హోదా దక్కలేదు.ఆ హోదా ఇస్తే కానీ.. అసెంబ్లీకి హాజరు కామని జగన్ తేల్చి చెబుతున్నారు. అయితే ఇటువంటి సంక్లిష్ట పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో సైతం ఇదే స్పష్టమైంది.
* ఒక్క పార్టీకి కూడా దక్కని బలం
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుటి కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. మహా వికాస్ అఘా డికి నిరాశ ఎదురైంది. కనీసం ఈ కూటమిలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. నిబంధనల ప్రకారం 10% సీట్లు రాలేదు. ఆ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు 20 సీట్లు, కాంగ్రెస్ కు 16, శరత్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీకి పది స్థానాలు మాత్రమే వచ్చాయి. మొత్తం అసెంబ్లీ సీట్లు 288 కి గాను 10% అంటే 29 సీట్లు రావాలి. కానీ విపక్ష కూటమిలో ఏ పార్టీకి కూడా అన్ని సీట్లు రాలేదు. దీంతో అక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది.
* ఏడు రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా
అయితే ఒక్క ఏపీ, మహారాష్ట్రే కాదు. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అనేది లేదు. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉండేవి. కానీ మొన్నటికి మొన్న ఏపీ, నిన్న మహారాష్ట్ర ఆ జాబితాలోకి వచ్చాయి. మొత్తానికైతే ప్రతిపక్షం హోదా లేకుండా అక్కడ పార్టీలు మనుగడ సాధించడం అసాధ్యం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.