Mechanic Rocky , Zebra : గత వారం 22వ తారీఖున టాలీవుడ్ లో మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘గామీ’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆయన ఆశలన్నీ ‘మెకానిక్ రాకీ’ చిత్రం మీదనే పెట్టుకున్నాడు. పర్ఫెక్ట్ కమర్షియల్ డ్రామా గా ఈ సినిమా వచ్చిందని, కచ్చితంగా నా కెరీర్ లో పెద్ద హిట్ అవుతుందని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ప్రొమోషన్స్ కూడా భారీ రేంజ్ లోనే చేసాడు. కానీ సినిమా ఎందుకో ఆడియన్స్ కి అసలు రీచ్ కాలేదు. పోనీ ఫ్లాప్ టాక్ వచ్చిందా అంటే అది కూడా లేదు, పర్వాలేదు బాగానే ఉంది అనే రేంజ్ టాక్ వచ్చింది . అయినప్పటికీ కూడా జనాలు థియేటర్స్ కి కదిలేందుకు ఆసక్తి చూపించలేదు.
అయితే అదే రోజు విడుదలైన సత్యదేవ్ ‘జీబ్రా’ చిత్రం మాత్రం థియేటర్స్ లో ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, కామెడీ కూడా వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఫలితంగా విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ చిత్రం కంటే మంచి వసూళ్లు వచ్చాయి. నిన్న బుక్ మై షో టికెట్ సేల్స్ యాప్ లో ‘మెకానిక్ రాకీ’ చిత్రానికి 24 గంటల్లో 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, ‘జీబ్రా’ చిత్రానికి ఏకంగా 26 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఎంత వ్యత్యాసం ఉందో మీరే చూడండి. ఒకసారి ఈ రెండు సినిమాలకు మూడు రోజుల్లో వచ్చిన షేర్ వసూళ్లను పరిశీలించి చూస్తే మెకానిక్ రాకీ చిత్రానికి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 3 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక జీబ్రా విషయానికి వస్తే మూడు రోజుల్లో ఈ చిత్రానికి 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా వచ్చాయట. ఓవర్సీస్ లో కూడా వీకెండ్ లో వసూళ్లు పుంజుకున్నాయి. అయితే ఓపెనింగ్స్ లో మాత్రం విశ్వక్ సేన్ కి యూత్ ఆడియన్స్ లో కాస్త మంచి క్రేజ్ ఉండడంతో ‘మెకానిక్ రాకీ’ కి ‘జీబ్రా’ కంటే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చింది. కానీ రెండవ రోజు నుండి మాత్రం ‘మెకానిక్ రాకీ’ చిత్రాన్ని ‘జీబ్రా’ దారుణంగా డామినేట్ చేస్తూ వస్తుంది. ఫుల్ రన్ లో కూడా క్లోజింగ్ కలెక్షన్స్ విషయం లో భారీ గ్యాప్ ఉండేలా ఉంది. కమర్షియల్ గా ‘జీబ్రా’ సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉండగా, మెకానిక్ రాకీ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయట.