Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: 8వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 6 మంది కంటెస్టెంట్స్...

Bigg Boss Telugu 8: 8వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 6 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..పృథ్వీ కోసం ప్రేరణని నామినేట్ చేసిన విష్ణుప్రియ!

Bigg Boss Telugu 8: నిన్నగాక మొన్ననే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనికా, కిరాక్ సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. అంటే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన 14 మందిలో 8 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది కేవలం ఆరు మంది మాత్రమే. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ వైల్డ్ కార్డు ద్వారా వచ్చినవారే. ఈ వారం కూడా పాత కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారా?, లేకపోతే వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదంతా పక్కన పెడితే, ఎప్పటి లాగానే నిన్న మధ్యాహ్నం నుండి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ ఎపిసోడ్ ని ఈరోజు రాత్రి టెలికాస్ట్ చేస్తారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే అని తెలుస్తుంది.

నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణు ప్రియ, మెహబూబ్ , నయనీ పావని మరియు హరితేజ నామినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. అయితే మెగా చీఫ్ అయిన కారణంగా గౌతమ్ కి బిగ్ బాస్ ఒకరిని నామినేషన్ నుండి తప్పించే పవర్ ఇస్తాడు. గౌతమ్ ఆ పవర్ ని ఉపయోగించి హరితేజ ని నామినేషన్స్ నుండి సేవ్ చేస్తాడు. కానీ అలా సేవ్ చేసినందుకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుండి లక్ష రూపాయిలను కట్ చేస్తాడు. అలా ఎందుకు చేసాడు అనేది నేటి ఎపిసోడ్ ని చూస్తే తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ నామినేషన్స్ ఎపిసోడ్ లో ప్రేరణ, విష్ణుప్రియ మధ్య పెద్ద గొడవ జరిగిందని తెలుస్తుంది. నిన్న ఎపిసోడ్ చివర్లో టీవీ లో టెలికాస్ట్ చేసిన ప్రోమోలోనే ఈ విషయం అందరికీ తెలిసింది.

ఆహారం విషయం లో విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసినట్టు చూపించారు. కానీ ఆమె ఆ వంకతో పృథ్వీ కోసం నామినేట్ చేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పృథ్వీ, ప్రేరణ కి ఈమధ్య అసలు పడడం లేదు, ఇది విష్ణుప్రియ కి నచ్చలేదు. అలాగే పృథ్వీ ప్రేరణ,రోహిణి ని నామినేట్ చేస్తాడు. ఈ నామినేషన్ కూడా హౌస్ లో చాలా ఫైర్ మీద జరిగినట్టు సమాచారం. అలాగే అవినాష్ పృథ్వీ ని నామినేట్ చేస్తాడు. మళ్ళీ వీళ్లిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అలా ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం పెద్ద హీట్ వాతావరణం లో జరిగినట్టు తెలుస్తుంది. అయితే నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మెహబూబ్, నయనీ పావని డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంది, వీరిలో నయనీ పావని ఎలిమినేట్ అవ్వొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version