https://oktelugu.com/

Bigg Boss Telugu 8: డబుల్ గేమ్స్ ఆడుతున్న సోనియా.. నిఖిల్ ముందు ఒకలా.. నిఖిల్ వెనుక మరోలా!

నిఖిల్ టెన్షన్ పార్టీ, అయోమయం గా ఉంటాడు, ఇతన్ని ట్రాప్ చేయడం ఎవరికైనా చాలా తేలిక. ఎవరికీ అంత స్పష్టంగా అర్థం కూడా కాదు, కానీ ఈయనకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టాస్కులు అద్భుతంగా ఆడగల కంటెస్టెంట్స్ లో ఒకరు.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 09:24 AM IST

    Bigg Boss Telugu 8(3)

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుంది, అలాగే మగవాడి పతనం వెనుక కూడా స్త్రీ హస్తమే ఉంటుంది, స్త్రీల వల్ల రాజ్యాలే కూలిపోయాయి, కురుక్షేత్రం లాంటి మహా సంగ్రామం కూడా జరిగింది. స్త్రీల మోజులో పడి పతనమైన వారిని ఇది వరకు మనం నిజ జీవితంలో ఎంతోమందిని చూసుంటాము. సినిమాల్లోనూ, రియాలిటీ షోస్ లోనూ చూసుంటాము. బిగ్ బాస్ షోలో గత మూడు నాలుగు సీజన్స్ నుండి చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే జరుగుతోంది. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో నిఖిల్ మరియు సోనియా మధ్య పెద్ద గొడవల నడుమ నామినేషన్స్ జరిగాయి. ఇద్దరి మధ్య మొదటి రెండు రోజులు పెద్దగా ర్యాపో కుదర్లేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఇద్దరు చాలా క్లోజ్ అయిపోతున్నారు. మ్యాటర్ చాలా దూరం వచ్చేసింది, సోనియా తన మాయ మాటలతో నితిన్ గేమ్ మొత్తాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది.

    అసలే నిఖిల్ టెన్షన్ పార్టీ, అయోమయం గా ఉంటాడు, ఇతన్ని ట్రాప్ చేయడం ఎవరికైనా చాలా తేలిక. ఎవరికీ అంత స్పష్టంగా అర్థం కూడా కాదు, కానీ ఈయనకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టాస్కులు అద్భుతంగా ఆడగల కంటెస్టెంట్స్ లో ఒకరు. అందుకే సోనియా నిఖిల్ వెంట పడుతుంది. ఈమె నామినేషన్స్ కి వచ్చినప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు మొత్తం ఈమెకే పడుతాయి. ఆ విధంగా నిఖిల్ తో ఈమె తన కెమిస్ట్రీ ని సెట్ చేసుకుంది. ఈరోజు ఈమె నిఖిల్ తో మాట్లాడుతూ ‘నువ్వు స్మోకింగ్ ఆపేయ్..నువ్వు అడిగితే అది ఇచ్చేస్తా’ అని అంటుంది. కేవలం ఒక లవర్ మాత్రమే ఇలాంటి మాటలు తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడగలదు. దానికి నిఖిల్ తెగ పొంగిపోతున్నాడు. ఈమె మాయలో పడి నిఖిల్ పాపం బెబక్క దృష్టిలో విలన్ అయిపోయాడు. సోనియా ఏరికోరి నిఖిల్ టీం ని ఎంచుకోలేదు, ఆమెకి వేరే దారి లేక నిఖిల్ టీం ని ఎంచుకుంది, ఈ విషయం సోనియానే తనతో చెప్పింది అని బేబక్క నిఖిల్ తో గొడవ పడుతున్న సమయంలో చెప్పుకొచ్చింది. దీనిని బట్టి అసలు సోనియా ఉద్దేశ్యం ఏమిటి, మెల్లగా నిఖిల్ గేమ్ ని చెడగొట్టి, అతన్ని వీక్ చేయాలనేది ఆమె ఉద్దేశ్యమా అనేది ఆడియన్స్ కి అర్థం కావడం లేదు.

    ఈరోజు కూడా సోనియా నిఖిల్ గురించి చెడుగా వేరే కంటెస్టెంట్స్ తో మాట్లాడడం లైవ్ లో కనిపించింది. రేపటి ఎపిసోడ్ లో ఆమె మాట్లాడిన ఈ మాటలు టెలికాస్ట్ అవుతాయి. నిఖిల్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని సోనియా కి దూరంగా ఉంటే టైటిల్ గెలుస్తాడు, లేకపోతే టాప్ 5 తో సరిపెట్టుకోవాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు. గత సీజన్ లో కూడా పల్లవి ప్రశాంత్ రతిక మాయలో పడి గేమ్ ని చెడగొట్టుకున్నాడు, ఆమె నిజస్వరూపం తెలుసుకొని బయటపడిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన విశ్వరూపం చూపించాడు, నిఖిల్ కూడా అలా తయారు అవుతాడో లేదో చూడాలి.