Bigg Boss Telugu 8: నేడు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ అనుకున్న రేంజ్ హీట్ వాతావరణం లోనే జరిగింది కానీ, కాస్త అర్థవంతంగానే జరిగింది. 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా దాదాపుగా 8 మంది కంటెస్టెంట్స్ ఈసారి నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ ప్రక్రియ ఈరోజు సగం జరిగింది, రేపు మిగిలిన సంగం జరగబోతుంది. ఇంకా నిఖిల్, యష్మీ, పృథ్వీ రాజ్, ప్రేరణ తదితరుల నామినేషన్స్ మిగిలి ఉన్నాయి. యష్మీ హౌస్ లో ఉన్న పెద్ద క్లాన్ కి లీడర్ అవ్వడం వల్ల ఆమె ఈ వారం కూడా నామినేషన్స్ నుండి తప్పించుకుంది. కాబట్టి ఆమెని ఎవరూ నామినేట్ చేయలేకపోయారు. ఇది ఇలా ఉండగా నేడు శేఖర్ బాషా ని ఆదిత్య ఓం మరియు నాగ మణికంఠ నామినేట్ చేసారు.
ఆదిత్య ఓం కి శేఖర్ బాషా మీద ఎదో చెప్పలేని కసి, కోపం కనిపించింది కానీ, మణికంఠ నామినేషన్ మాత్రం శేఖర్ బాషా పై చాలా సిల్లీ గా అనిపించింది. పాపం మణికంఠ చెప్పిన రీజన్ కి శేఖర్ బాషాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున వినాయక చవితి సందర్భంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ స్వీట్స్ పంపించాడట. ఈ స్వీట్స్ ని శేఖర్ బాషా నే తీసుకొచ్చాడు. అయితే శేఖర్ బాషా ఆ స్వీట్స్ ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా, దాచిపెట్టుకొని తన క్లాన్ సబ్యులకు మాత్రమే పంచాడట. అలా చేయడం చాలా తప్పు,నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, నాకు స్వీట్ రాలేదని బాధపడ్డాను, అందుకే మిమల్ని నామినేట్ చేస్తాను అంటూ శేఖర్ బాషాని నామినేట్ చేసాడు. అప్పుడు శేఖర్ బాషా దానికి సమాధానం చెప్తూ ‘ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు స్థలం లేకపోవడంతో, అప్పటికే ఆ స్వీట్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి, బయట పెడితే చీమలు వస్తాయని జాగ్రత్తగా ప్యాక్ చేసి లాకర్ లో పెట్టాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని కూడా చెప్పాను. ఇంత చిన్న రీజన్ కి నన్ను నామినేట్ చేస్తావా’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.
అప్పుడు మణికంఠ మరో కారణం చెప్తూ ‘నేను వేరే మూడ్ లో ఉన్నప్పుడు జోక్ వేస్తారు. ఒకవేళ మీరు వేసిన జోక్ ఆ సందర్భంలో నేను వేరేలాగా ట్రిగ్గర్ అయితే పెద్ద గొడవలు అవుతాయి, ఇది మీరు తగ్గించుకోవాలి, అందుకే నామినేట్ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మణికంఠ. ఈ రీజన్ కూడా శేఖర్ బాషాకి నచ్చలేదు, అయినా కూడా చివరికి నామినేషన్ అంగీకరించాడు. కానీ మణికంఠ ఆదిత్య ఓం, శేఖర్ బాషా ఇద్దరినీ నామినేట్ చేస్తే, ఇద్దరికీ సరైన కారణాలు ఇవ్వకపోవడం గమనార్హం. జనాలు ఇలాంటివి బాగా గమనిస్తారు, గత వారం మణికంఠ ఎలిమినేషన్ కి చాలా దగ్గరగా వెళ్లి వచ్చాడు, తన ఆట తీరుని మార్చుకోకుంటే ఈ వారం అతను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.