Devara Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మరొకరు లేరు అనేంతలా ఆయన మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో కొరటాల శివ డైరెక్షన్ లో ఆయన చేస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పటివరకు ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’ గా తనకంటూ ఒక గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాతో భారీ హిట్ కొట్టి అంతకుమించి అనేలా బాలీవుడ్ లో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో కొరటాల శివ మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే తను కూడా భారీ సక్సెస్ ని అందుకొని ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా సినిమా మీద అంచనాలను కూడా పెంచాయి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా నుంచి వచ్చే ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇక ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు దేవర సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా భారీ అంచనాలు పెరుగుతాయా లేదంటే ఆ అంచనాలను తగ్గించే విధంగా ట్రైలర్ ఉంటుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఈ ఒక్క ట్రైలర్ కనక అద్భుతంగా ఉన్నట్లయితే సినిమా మీద సగటు ప్రేక్షకుడికి కూడా విపరీతమైన ఇష్టమైతే పెరుగుతుంది. ఇక టీజర్ ని చాలా అద్భుతంగా కట్ చేశారు. మరి ట్రైలర్ కూడా అంతే అద్భుతంగా కట్ చేసి సినిమా మీద హైప్ ను క్రియేట్ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ముఖ్యంగా ట్రైలర్ లో ఒక సస్పెన్స్ ను కూడా రివిల్ చేయబోతున్నారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అదేంటి అంటే దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఒకటి సీనియర్, మరొకటి జూనియర్ క్యారెక్టర్లను పోషిస్తున్న ఆయన ఈ సినిమాతో ఆ రెండు క్యారెక్టర్ల తాలూకు ఇంపాక్ట్ ను భారీ రేంజ్ లో చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ఆ రెండు క్యారెక్టర్ లను చేసి ఆ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటో తెలియజేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా కనక చేసినట్లయితే ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…