Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా...

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సీజన్ 1 హాట్ లేడీ కంటెస్టెంట్..రెమ్యూనరేషన్ విషయంలో సరికొత్త రికార్డు!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై నేటితో 3 వారాలు పూర్తి అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఈ సీజన్ నుండి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ లోకి ఆదిత్య ఓం, నిఖిల్, నబీల్, సోనియా తప్ప అందరూ వచ్చారు. వీరిలో అభయ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ వారం అతను ఆడిన ఆట తీరు ప్రేక్షకులకు అంతటి చిరాకుని కలిగించాయి. అయితే నిన్న మొన్నటి వరకు నెగటివ్ ఇమేజ్ తో కొనసాగిన యష్మీ ప్రేరణ మొన్నటి ఎపిసోడ్ తో పాజిటివ్ లోకి వచ్చేసారు. అయితే వీరిలో యష్మీ కూడా డేంజర్ జోన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి అనేది ఖరారు అయ్యింది. అక్టోబర్ 4 వ తేదీన వైల్డ్ కార్డు ద్వారా హౌస్ మేట్స్ ఎంటర్ అవ్వబోతున్నారు. వీరిలో పాత కంటెస్టెంట్స్ ఉన్నారు, కొత్త కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరు అనేది దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సీజన్ లో టాప్ 5 వరకు వచ్చిన లేడీ కంటెస్టెంట్ హరి తేజ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?..ఆమె ఆడిన ఆట తీరు అప్పట్లో ఎంతో బాగుండేది. అంతే కాదు ఈమె ఆ సీజన్ చెప్పిన హరి కథలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అలా బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న ఈమె, సినిమాల్లో అవకాశాలు కూడా బాగానే సంపాదించింది. అయితే ఈమధ్య ఈమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. అయితే రీసెంట్ గా ఈమెని బిగ్ బాస్ టీం వారు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి మీకు ఆసక్తి ఉందా అని అడగగా, ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అయితే వయస్సు లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరికంటే హరి తేజ కాస్త పెద్దది. టాస్కులు ఒకప్పుడు ఆడిన విధంగా ఇప్పుడు ఆడగలదా లేదా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా ఈమెకి రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఇస్తున్నారట బిగ్ బాస్ టీం. ఒక్క వారానికి గాను ఆమెకి 4 లక్షల 50 వేల రూపాయిలు ఇస్తున్నారట. ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. సీజన్ 4 లో యాంకర్ రవి కి వారానికి నాలుగు లక్షల రూపాయిలు ఇచ్చేవారట. ఇదే ఇప్పటి వరకు అత్యధిక రెమ్యూనరేషన్. ఇప్పుడు ఆయన రికార్డు ని హరి తేజ బ్రేక్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. చూడాలి మరి ఈమె ఎలా ఆడబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version