Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్’ కాదు..’దొంగ బాస్’ అంటున్న అభయ్..ఇతని నోటి దూల వల్ల టీం మొత్తం బ్యాన్!

అభయ్ ముఖం లో ఉన్న బలుపుని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. మనస్ఫూర్తిగా క్షమాపణలు కూడా ఆయన చెప్పలేదు. పైగా బయటకి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ గురించి నెగటివ్ గా మాట్లాడుతాను అంటున్నాడు. కేవలం అతను మాట్లాడడమే కాకుండా, తన క్లాన్ లో ఉన్న సభ్యులను కూడా ప్రభావితం చేసి, బిగ్ బాస్ పై జోకులు నెగటివ్ కామెంట్స్ చేసేలా చేసారు.

Written By: Vicky, Updated On : September 21, 2024 8:31 am

Bigg Boss Telugu 8(32)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నోటి దూల తార స్థాయిలో ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అభయ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇతను హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు టాప్ 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకడు అని అందరూ అనుకున్నారు. కానీ బిల్డప్స్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుగా ఇతని వ్యవహార శైలి ఉంది ఇతను గేమ్ బాగా ఆడాలి అనుకుంటే ఆడగలడు, కానీ కావాలని ఆడడు. ఏ సందర్భం వచ్చినా రిలాక్స్ అవ్వాలని అనుకుంటాడు. ఎంతసేపు సోనియా, నిఖిల్ తో ముచ్చట్లు తప్ప గేమ్ స్ట్రాటజీ కానీ, ఆడాలనే కసి కానీ ఇతనిలో లేదు. పైగా ఈయన హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి పైన నోరేసుకొని పడిపోతాడు. అది కంటెస్టెంట్స్ కి మాత్రమే పరిమితమా అంటే, అది కూడా లేదు. ఏకంగా బిగ్ బాస్ ని అడ్డమైన మాటలు అంటున్నాడు. అతని వల్ల నష్టం జరిగేలా ఉందని, సోనియా అతని దగ్గరకి వెళ్లి ‘మా క్లాన్ లో ఎవరూ బిగ్ బాస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. మీ క్లాన్ లో ఎవరైనా చేసారా?, చేసుంటే వెంటనే క్షమాపణలు చెప్పు’ అని అంటుంది.

అప్పుడు అభయ్ ముఖం లో ఉన్న బలుపుని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. మనస్ఫూర్తిగా క్షమాపణలు కూడా ఆయన చెప్పలేదు. పైగా బయటకి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ గురించి నెగటివ్ గా మాట్లాడుతాను అంటున్నాడు. కేవలం అతను మాట్లాడడమే కాకుండా, తన క్లాన్ లో ఉన్న సభ్యులను కూడా ప్రభావితం చేసి, బిగ్ బాస్ పై జోకులు నెగటివ్ కామెంట్స్ చేసేలా చేసారు. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని పిలిచి, అభయ్ కి వార్నింగ్ ఇస్తూ , ‘బిగ్ బాస్ ని దుర్భాషలు ఆడావు. ఈ హౌస్ లో ఉండాలంటే కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే అనుసరించాలి, ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే బయటకి వెళ్లిపోవచ్చు’ అని డోర్లు తీస్తాడు. పెద్ద పౌరుషం ఉన్న అభయ్, బిగ్ బాస్ నిర్ణయాలకు ఏమాత్రం విలువ ఇవ్వని వ్యక్తి, నాకు ఈ షో అక్కర్లేదు అని వెళ్లిపోవచ్చు కదా?, ఎందుకు వెళ్ళలేదు అనేదే ప్రశ్న. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అభయ్ లో ఎలాంటి పశ్చాతాపం లేదు.

నేనేమి అన్నాను, నేనేమి అనలేదు, బిగ్ బాస్ మీద జోక్స్ వేయడం కూడా తప్పు అంటే ఇక వేయను బిగ్ బాస్ అని వెటకారం గా అంటాడు. ఇతను అసలు హౌస్ లో ఉండేందుకు అర్హుడేనా?, వీకెండ్ లో నాగార్జున ఇలా మాట్లాడినందుకు బాగా తిడుతాడు అనే విషయం ఇతనికి తెలియకుండా ఉండదు, అయినప్పటికీ రెచ్చిపోయాడు. అంటే నాగార్జున మీద కూడా గౌరవం లేనట్టే, ఒకపక్క బిగ్ బాస్ మీద గౌరవం లేదు, మరోపక్క నాగార్జున మీద కూడా లేదు, ఈ వారం న్యాయంగా ఇతనికి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపడం ఒక్కటే సరైన న్యాయం. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. నిన్న మొన్న జరిగిన టాస్కులలో యష్మీ, ప్రేరణ, మణికంఠ ఎంత కష్టపడి గేమ్ ని ఆడారో మన అందరికీ తెలిసిందే. ఆ కష్టం మొత్తం వృధా అయిపోయింది, బిగ్ బాస్ మీద అభయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు చీఫ్ కంటెస్టెంట్స్ గా పోటీ చేసేందుకు అభయ్ టీం ని బ్యాన్ చేసాడు. కేవలం నిఖిల్, సోనియా మాత్రమే పోటీ పడగా, నిఖిల్ ఆ టాస్కులో గెలిచి మరోసారి చీఫ్ అయ్యాడు.