https://oktelugu.com/

Daku Maharaj : డాకు మహారాజ్ కోసం బాలయ్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్స్ వచ్చిన ఎక్కడా కూడా కృంగిపోకుండా సినిమాలను ముందుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2024 / 09:19 AM IST

    Do you know the remuneration taken by Balayya for Daku Maharaj..?

    Follow us on

    Daku Maharaj : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్స్ వచ్చిన ఎక్కడా కూడా కృంగిపోకుండా సినిమాలను ముందుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ఐడెంటిటి ని సంపాదించుకోవడానికి సినిమాలు చేస్తున్నారు. తద్వారా వాళ్ళు స్టార్లుగా ఎదిగాలని కూడా చూస్తున్నారు..

    సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో వచ్చిన హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకత ను ఏర్పాటు చేసుకొని తండ్రికి తగ్గ తనయుడి గా గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే కావడం విశేషం…ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ ప్రస్తుతం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ ఎవరికి వారు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు తమను ఆదరిస్తారనే విధంగా ప్లాన్లను రూపొందించుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయి అనేది ఇప్పుడు ఎల్లలు దాటి ముందుకు సాగుతున్న సమయాన మంచి కథలతో సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘డాకు మహారాజ్’ అనే సినిమా కూడా చాలా ఫ్రెష్ కంటెంట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలోని ప్రతి డైలాగులు విషయం లో కూడా బాబీ చాలా జాగ్రత్తలు తీసుకొని మరి రాసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ బ్యాడ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి సంతృప్తినిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది.

    ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    నిజానికి బాలయ్య బాబు సినిమాలో డైలాగులు పుష్కలంగా ఉంటాయి. నిజానికి బాలయ్యతో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చేస్తే అది సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా తర్వాత అఖండ 2 సినిమా ని సెట్స్ మీదకి తీసుకెళ్ళే పనిలో బాలయ్య బిజీగా ఉన్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ‘డాకు మహారాజ్’ సినిమా కోసం బాలయ్య బాబు దాదాపు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలందరిలో చిరంజీవి తర్వాత బాలయ్య బాబు చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.