Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మానవ మృగం కంటే దారుణంగా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది పృథ్వీ రాజ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అసలు ఇతని ఆట తీరుని చూస్తే ఎవరికైనా బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లి నాలుగు పీకాలి అని అనిపిస్తుంది. నిన్న జరిగిన టాస్కులో అయితే ఇతను ప్రేరణ, యష్మీ పట్ల ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. అంత దారుణంగా ప్రవర్తించాడు. ఆటలో మునిగి అసలు ఏమి చేస్తున్నాడో ఇతనికి స్పృహ కూడా లేదు. యష్మీ, ప్రేరణ ఎగ్స్ కోసం వచ్చినప్పుడు వాళ్ళని ఆట బొమ్మలు లెక్క పక్కకి తోసి వాళ్ళిద్దరి శరీరంలోని ప్రైవేట్ భాగాల మీద చేతులు అదిమి పట్టుకున్నాడు. వాళ్ళు వదలమని ఎంత అరిచి చెప్పినా అతను వినలేదు. అసలు ఎందుకు మమ్మల్ని పట్టుకున్నాడు అనే విషయం కూడా అతనికి అర్థం కాలేదు. ఆ తర్వాత సంచాలక్ గా వ్యవహరించిన నబీల్ పై రెచ్చిపోయాడు.
నిలదీసిన నాగ మణికంఠ ని కొట్టేంత పని చేసాడు. ఏమి చేస్తావు రా చంపేస్తావా? అంటూ నాగ మణికంఠ కూడా తన గొంతుక ని వినిపించాడు. పృథ్వీ రాజ్ కి చాలా గట్టిగా ఇచ్చి పారేసాడు. కోపం లో అడ్డదిడ్డంగా నోరు జారే అలవాటు ఉన్న పృథ్వీ రాజ్ కి గత వారం లో నాగార్జున చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వారం ఆయన మాటలను దృష్టిలో పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అసలు పెట్టుకోలేదు. మొన్న జరిగిన ఎపిసోడ్ లో బూతులు మాట్లాడాడు, నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా బూతులు మాట్లాడాడు. ఇతనిని తన క్లాన్ సభ్యులు కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేసారు. కానీ వాళ్ల వల్ల అవ్వలేదు. అచ్చేసిన ఆంబోతు లాగా రంకెలు వేస్తూనే ఉన్నాడు. కిరాక్ సీత నోటిని అదుపులో పెట్టుకో అని చెప్పేందుకు ముందుకు వస్తే, ఆమె మీద కూడా నోరేసుకొని పడిపోయాడు.
దీంతో సీత ‘ఇంకోసారి నేను నీ మంచి కోసం చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేయను’ అని ఏడుస్తూ చెప్తుంది. మొన్న అయితే ఇతగాడు ఆదిత్య ఓం మీద ఎంతలా విరుచుకొని పడ్డాడో మనమంతా చూసాము. ఎంతో మర్యాదగా ఆదిత్య ఓం ప్రవర్తిస్తే, అతని వయస్సుకి కూడా మర్యాద ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇలా మానవ మృగం లాగా ప్రవర్తిస్తున్న పృథ్వీ కి ఈ వారం అక్కినేని నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను బిగ్ బాస్ హౌస్ లో ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఎవరో ఒకరి కాళ్ళు, చేతులు విరిచేసే ప్రమాదం కూడా ఉంది. నాగార్జున అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పృథ్వీ ఈ రకంగా ప్రవర్తించాడంటే కచ్చితంగా ఆయనపై ఈ వీకెండ్ కఠినమైన చర్యలు తీసుకుంటారు.