https://oktelugu.com/

Manchu Manoj : తండ్రి మోహన్ బాబు-అన్న విష్ణు చేస్తోంది ఇదీ.. లేఖలో సంచలన విషయాలు బయటపెట్టిన మంచు మనోజ్…

గత కొద్దిరోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మనకు తెలిసిందే... ఇక రీసెంట్ గా మోహన్ బాబు తన కొడుకు అయిన మంచి మనోజ్ పైన దాడి చేయించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 09:50 AM IST

    Manchu Manoj

    Follow us on

    Manchu Manoj : గత కొద్దిరోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మనకు తెలిసిందే… ఇక రీసెంట్ గా మోహన్ బాబు తన కొడుకు అయిన మంచి మనోజ్ పైన దాడి చేయించాడు. ఇక ఈ విషయం మీద మనోజ్ కూడా స్పందిస్తూ మోహన్ బాబు పేరు మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనాన్ని రేపుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన రీసెంట్ గా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాన్న అయిన మోహన్ బాబు నుంచి తనకు తన భార్యకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారు… ఇక అలాగే మనోజ్ వాళ్ళ నాన్న అయిన మోహన్ బాబు కూడా నా కొడుకు మనోజ్ అతన్ని భార్య మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ రాచకొండ కమిషనర్ కి కంప్లయింట్ చేశాడు…

    ఇక ఇదిలా ఉంటే మనోజ్ మోహన్ బాబు వైఖరి మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేశాడు. మనోజ్ తన భార్య ఇద్దరు కలిసి ఎవ్వరూ సపోర్ట్ లేకుండా బతుకుతున్నప్పటికి సొసైటీలో తమ పరువు తీయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన మా మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మంచు మనోజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను లేవనెత్తుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను ఉప ముఖ్యమంత్రి యాడ్ చేస్తూ తను పోస్ట్ కు ట్యాగ్ చేశాడు…ఇక అందులో ముఖ్యంగా కొన్ని విషయాల గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు…

    నా మీద నా భార్య అయిన మౌనిక రెడ్డి మీద మా నాన్న మోహన్ బాబు కక్ష్య కట్టాడని సొసైటి లో మమ్మల్ని బ్యాడ్ గా ప్రూవ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడని మనోజ్ తెలియజేశాడు…

    ఇక ఇదిలా ఉంటే మనోజ్ సోదరుడు అయిన విష్ణు కొన్ని కారణాలతో దుబాయ్ వెళ్లడం వల్ల మనోజ్ వాళ్ళ నాన్న ఆయన మోహన్ బాబు కోరిక మేరకు మా ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటే చూడలేకే నేను మా నాన్న తో పాటు వాళ్ల స్నేహితుల కోరిక మేరకు వాళ్ల ఇంట్లో ఉంటున్నాను అని చెప్పాడు. ఇక నేను ఆ ఇంట్లో సంవత్సరం నుంచి ఉంటున్నానని తెలియజేశాడు. కానీ మోహన్ బాబు గారు మాత్రం నా భార్య గర్భవతిగా ఉండటం వల్లే నేను ఆ ఇంట్లోకి వచ్చానని కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఆ ఇంట్లోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. మరి ఆయన ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడనేది అర్థం కావడం లేదు…

    ఇక అభం శుభం తెలియని నా కూతుర్ని గొడవలోకి లాగారు. ఇది చాలా దారుణమైన విషయం..నా బిడ్డని ఇందులోకి లాగడం తోనే వాళ్ల ఫిర్యాదు వెనక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు క్లియర్ గా అర్థమైంది.

    ఇక ఇంట్లో పని చేసే మహిళా సిబ్బంది పైన మా నాన్న తీవ్రంగా దూషిస్తూ ఉండడంతో వాళ్లు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నా నాన్న వల్ల కొంతమంది సిబ్బంది ఎలాంటి బాధలు పడ్డారో కూడా వాటిని నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను అంటూ మనోజ్ తెలియజేశాడు. ఇక దాంతో పాటుగా నేను నా బిడ్డని ఆయా దగ్గర వదిలేసి పట్టించుకోకుండా వెళ్లాను అంటూ కొన్ని కామెంట్లు అయితే చేశాడు. ఆయాతో పాటు మా అమ్మ దగ్గర నా బిడ్డను వదిలేసి నాకు తగిలిన గాయాలకు చికిత్స చేయించుకోవడానికి నా భార్యతో కలిసి నేను హాస్పటల్ కి వెళ్లాను అంటూ తను వివరణ ఇచ్చాడు…

    ఇక ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని ఎందుకు తొలగించారు. విష్ణు అనుచరులు అయిన వినయ్ రెడ్డి, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇలాంటి ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారు అంటూ ఆయన తన భాదను తెలియజేస్తూ వచ్చాడు…

    ఇక తను ఎవ్వరూ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదని స్వతంత్రంగా బతకడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తూ ముందుకు సాగానంటూ చెప్పడం విశేషం… ఇక దాంతో పాటుగా 8 సంవత్సరాల పాటు మా నాన్న, అన్న సినిమాల కోసం విపరీతంగా కష్టపడ్డానని కూడా చెప్పాడు…

    యూనివర్సిటీ విషయంలో విష్ణు చేస్తున్న అవకతవకల గురించి, వ్యాపారస్తులతో తను చేసుకుంటున్న డీలింగ్స్ ఏంటి అనేది చెప్పాలని వాటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని అన్నాడు…

    ఇక నేను ఎప్పుడూ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వలేదు సినిమాలు చేసుకుంటూ వచ్చిన డబ్బులతోనే నేను సర్వేవెల్ అవుతున్నానంటూ చెప్పాడు…కానీ తన అన్న ఆయన విష్ణు మాత్రం ఇప్పటికి తన కుటుంబం మీదనే ఆధారపడి బతుకుతున్నాడు అంటూ చెప్పాడు… నేనెప్పుడూ ఆస్తి కోసం అంతస్తులు కోసం ఆరాటపడలేదు అంటూ ఆయన తన లేఖలో పొందుపరిచారు…

    ఇక ఇప్పుడు కూడా నా నాన్న నన్ను తప్పించి మా అన్నకే ఆస్తిపాస్తులను కట్టబెట్టాలని కూడా చూస్తున్నాడు అంటూ తెలియజేయడం విశేషం…

    ఇక కుటుంబంలో వస్తున్న కలహాలకు పరిష్కారం దొరకాలంటే ముందు మీటింగ్ పెట్టాలంటూ నేను చాలాసార్లు చెప్పినప్పటికీ మా నాన్న అయిన మోహన్ బాబు ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు అంటూ ఆయన తన లేఖలో పొందుపరిచాడు…

    Tags