https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మెహబూబ్ ఎలిమినేట్ అవ్వాలి.. కానీ అవినాష్ అవుట్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అందరి కంటే తక్కువ ఓట్లు దక్కించుకున్నది మెహబూబ్. కానీ అవినాష్ బయటకి రావడం ఏమిటి ?, అంటే ఇతను కూడా మణికంఠ లాగా ట్విస్ట్ ఇచ్చి వెళ్లిపోయాడా అని అనుకుంటున్నారు. ఈ విషయం పై ఆరా తియ్యగా, అవినాష్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తాత్కాలిక చికిత్స కోసం హాస్పిటల్ కి బిగ్ బాస్ టీం అనుమతి తో బయటకి వచ్చాడట.

Written By:
  • Vicky
  • , Updated On : October 27, 2024 / 08:25 AM IST

    Bigg Boss Telugu 8(162)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డు ఎంట్రీలకు ముందు ఒకలాగా, వాళ్ళ ఎంట్రీ తర్వాత ఒకలాగా మరోలాగా మారిపోయింది. అంతకు ముందు ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువగా ఉండేది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్, ఫన్ అదిరిపోయింది. ముఖ్యంగా అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వంటి వారు అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా అవినాష్, టేస్టీ తేజ అయితే కేవలం ఎంటర్టైన్మెంట్ పంచద్దాం మాత్రమే కాదు. టాస్కులు చాలా దమ్ముగా ఆడుతున్నారు. టేస్టీ తేజా ఈ సీజన్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే అవినాష్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాడని, ఆ తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్ కి తన కార్ లో వెళ్లడం అన్నపూర్ణ స్టూడియోస్ లో అనేక మనది ప్రత్యక్షంగా చూశారట.

    అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అందరి కంటే తక్కువ ఓట్లు దక్కించుకున్నది మెహబూబ్. కానీ అవినాష్ బయటకి రావడం ఏమిటి ?, అంటే ఇతను కూడా మణికంఠ లాగా ట్విస్ట్ ఇచ్చి వెళ్లిపోయాడా అని అనుకుంటున్నారు. ఈ విషయం పై ఆరా తియ్యగా, అవినాష్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తాత్కాలిక చికిత్స కోసం హాస్పిటల్ కి బిగ్ బాస్ టీం అనుమతి తో బయటకి వచ్చాడట. మళ్ళీ రెండు గంటల తర్వాత ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి వచ్చినట్టు చెప్తున్నారు. ఇదంతా రేపటి ఎపిసోడ్ లో చూపించే అవకాశం ఉంది. లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా కట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే నిఖిల్ కూడా ఒకసారి ఇలాగే బయటకి వెళ్లి తిరిగి వచ్చాడు. హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లైవ్ చూస్తున్న సమయంలో చాలా సమయం వరకు నిఖిల్ హౌస్ లో కనిపించుకుందా పోయిన విషయాన్ని ఆడియన్స్ గమనించారు.

    కానీ ఎపిసోడ్ లో అది చూపించలేదు. అవినాష్ విషయంలో కూడా అదే జరగొచ్చు. నిఖిల్ ది కనీసం లైవ్ లో అయినా గమనించాము, కానీ అవినాష్ కి ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే శనివారం, ఆదివారం కి సంబంధించినవి లైవ్ చూపించరు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. హౌస్ లో టాస్కులు ఆడేదే 5 మంది. ఆ 5 మందిలో మెహబూబ్ ఒకడు, ఇప్పుడు ఆయనే హౌస్ నుండి వెళ్ళిపోయాడు. సీజన్ 4 లో ఉన్న ఫైర్, ఈ సీజన్ లో చూపించకపోవడం, ఒక సరికొత్త మెహబూబ్ ని చూపించడం, ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు, అందుకే అయన ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు విశ్లేషకులు.