https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బూతులు తిట్టిన తన కన్నడ బ్యాచ్ ని పక్కన పెట్టి ప్రేయసి కోసం గౌతమ్ ని టార్గెట్ చేసిన నిఖిల్!

నిఖిల్ కి బూతులు తిట్టినట్టు అనిపించింది కాబట్టి, నిన్న ఈ పాయింట్ మీద గౌతమ్ ని నామినేట్ చేసి ఉన్నా నిఖిల్ కి ఇంతటి నెగటివిటీ వచ్చేది కాదు. తన ప్రేయసి యష్మీ ని గౌతమ్ అక్కా అని పిలిచినందుకు నిఖిల్ మనోభావాలు దెబ్బ తిన్నాయట.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 08:02 AM IST

    Bigg Boss Telugu 8(201)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్నటి ఎపిసోడ్ తో నిఖిల్ ఇన్ని రోజులు ఆయన కష్టపడి టాస్కులు ఆడి సంపాదించుకున్న పేరు మొత్తాన్ని నాశనం చేసుకున్నట్టు అనిపించింది. గౌతమ్ ని అన్యాయంగా టార్గెట్ చేసి నామినేషన్ వేసినట్టు ఆడియన్స్ కి అనిపించింది. గత వారం లో ఈయనకి, గౌతమ్ కి వాటర్ టాస్క్ లో పెద్ద గొడవ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గొడవలో గౌతమ్ నిఖిల్ పై ‘ఎక్కువ తక్కువ చేయకు’ అని పెద్దగా అరిచాడు కానీ, గౌతమ్ తనని బూతులు తిట్టాడు అంటూ నిఖిల్ ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ అయ్యేలా చేసాడు. వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున వీడియో వేసి చూపించాడు. అందులో గౌతమ్ తిట్టినట్టు ఎవరికీ అనిపించలేదు. ఒకవేళ బూతులు వచ్చిన బయటకి అనకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాడు. కానీ చివరికి గౌతమే తప్పు చేసినట్టు నాగార్జున ప్రొజెక్ట్ చేసి చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    నిఖిల్ కి బూతులు తిట్టినట్టు అనిపించింది కాబట్టి, నిన్న ఈ పాయింట్ మీద గౌతమ్ ని నామినేట్ చేసి ఉన్నా నిఖిల్ కి ఇంతటి నెగటివిటీ వచ్చేది కాదు. తన ప్రేయసి యష్మీ ని గౌతమ్ అక్కా అని పిలిచినందుకు నిఖిల్ మనోభావాలు దెబ్బ తిన్నాయట. ఆమె కోసం నిన్న ఆయన పెద్ద యుద్ధమే చేసాడు. గౌతమ్ యష్మీ ని అక్కా అని పిలవడానికి చాలా పెద్ద కారణం ఉంది. యష్మీ అక్క ఆయన ఎమోషన్స్ తో ఆడుకుంటూ నిఖిల్ ని ప్రేమలో పడేయడానికి గౌతమ్ ని ఉపయోగించుకుంది. గౌతమ్ స్థానంలో ఎవరున్నా ఇంకా చాలా వయొలెంట్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. గౌతమ్ కాబట్టి అక్కా తో సరిపెట్టాడు, ఆ ‘అక్కా’ అనే పదం కూడా ఊరికే రాలేదు, విష్ణు ప్రియ, గౌతమ్ కి మధ్య పెద్ద వాదనలు జరుగుతున్న సమయంలో యష్మీ మధ్యలో దూరడం వల్ల ఆయన నోటి నుండి వచ్చేసింది.

    దానికి యష్మీ మనసు నొచ్చుకొని నామినేషన్ వేసినా ఒక అర్థం ఉంటుంది కానీ, ఆమె కోసం నిఖిల్ నామినేషన్ వేయడం ఏమిటో ఆడియన్స్ కి అర్థం కాలేదు. నిఖిల్ కి ప్రేరణ మీద నామినేషన్ వేయడానికి పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆమె గౌతమ్ ని F పదం తో తిట్టింది. ఆమె తిట్టడం వల్లే నేను అంత వయొలెంట్ అయ్యి, ఆరోజు గేమ్ అలా ఆడాను అని చెప్పుకొచ్చిన నిఖిల్, అలా ఆడదానికి కారణమైన ప్రేరణ ని కదా నామినేట్ చేయాలి. కానీ ఎన్ని తిట్టుకున్నా ఆమె స్నేహితురాలు కాబట్టి, ఆమె జోలికి పోకుండా గౌతమ్ మీదకు వెళ్ళాడు. ఇక్కడే ఆడియన్స్ కి కోపం వచ్చింది. నిఖిల్ మణికంఠ కి బయట ఆడియన్స్ లో సానుభూతి పెరిగిపోతుంది అని గమనించి అతన్ని తెలివిగా టార్గెట్ చేయడం మానేసాడు. ఇప్పుడు గౌతమ్ విషయం లో కూడా అదే జరుగుతుంది. ఇలా ప్రతీ చిన్న విషయానికి గౌతమ్ ని టార్గెట్ చేయడం ఆపకపోతే, గౌతమ్ చేతిలో కప్పు పెట్టి పంపించినట్టే, మరి ఇది అర్థం చేసుకొని నిఖిల్ గౌతమ్ ని టార్గెట్ చేయడం ఆపేస్తాడో లేదో చూడాలి.