https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఒక్కడు వర్సస్ నలుగురు..కన్నడ బ్యాచ్ కి ఇచ్చి పారేసిన గౌతమ్..ఓటింగ్ లో భారీ మార్పు!

ముఖ్యంగా నిఖిల్ అయితే ఈమధ్య గౌతమ్ జపం తప్ప మరొకటి చేయడం లేదు. నిన్న వీళ్లంతా కలిసి నామినేషన్స్ లో మళ్ళీ ఆయన్ని ఎలా టార్గెట్ చేసారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ గౌతమ్ ఒక్కడే వాళ్ళందరిని ధైర్యం ఎదురుకొని ఇచ్చి పారేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 07:54 AM IST

    Bigg Boss Telugu 8(200)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో మణికంఠ ని కన్నడ బ్యాచ్ ఎలా టార్గెట్ చేసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ చిన్న విషయానికి అతన్ని నిందించి టార్గెట్ చేసారు. ఓర్చుకున్నని రోజులు ఓర్చుకొని పోరాడాడు కానీ, ఇక నా వల్ల కాదు బాబోయ్ అని భయపడి చివరికి హౌస్ నుండి తనని తాను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఘటన బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక సంచలనం గా మారింది. హౌస్ లో ఉన్న ఆ నలుగురు కన్నడ బ్యాచ్ తమని డామినేట్ చేస్తున్నాడు, ఇతని వల్ల మాకు డేంజర్ అని అనిపిస్తే చాలు, వాళ్ళని టార్గెట్ చేయడం మొదలు పెడుతారు. ఇప్పుడు మరోసారి అది గౌతమ్ విషయం లో జరుగుతుంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వారిలో గౌతమ్ లో అందరి కంటే చాలా స్ట్రాంగ్ గా గేమ్స్ ఆడుతున్నాడు. రెండవ వారం లోనే ఆయన ఒంటిచేతితో 12 మందిని ఓడించి మెగా చీఫ్ అయ్యాడు. అప్పటి నుండి నిఖిల్, యష్మీ, ప్రేరణ లో గౌతమ్ అంటే చిన్న భయం మొదలైంది.

    ముఖ్యంగా నిఖిల్ అయితే ఈమధ్య గౌతమ్ జపం తప్ప మరొకటి చేయడం లేదు. నిన్న వీళ్లంతా కలిసి నామినేషన్స్ లో మళ్ళీ ఆయన్ని ఎలా టార్గెట్ చేసారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ గౌతమ్ ఒక్కడే వాళ్ళందరిని ధైర్యం ఎదురుకొని ఇచ్చి పారేసాడు. అక్క అన్నందుకు మనోభావాలు దెబ్బ తిని నామినేట్ చేయడం బిగ్ బాస్ హిస్టరీ లో ఇదే తొలిసారి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ వాదించిన తీరు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందుకే నిన్నటి ఎపిసోడ్ విన్నర్ ఎవరో తేల్చేసింది. ఈ వారం నామినేషన్స్ లోకి గౌతమ్ తో పాటు నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ, హరితేజ, యష్మీ వచ్చారు. వీరిలో నిన్నటి ఎపిసోడ్ పూర్తి అయ్యాక గౌతమ్ అందరికంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు.

    నిఖిల్ మీద ఏకంగా 5 శాతం ఓట్ల తేడా తో గౌతమ్ దూసుకుపోతున్నాడు. గౌతమ్ ఫ్యాన్స్ తో పాటు, మణికంఠ ఫ్యాన్స్ కూడా గౌతమ్ కి ఓట్లు వేస్తున్నారు. అందుకే ఈ రేంజ్ ఓటింగ్ తేడా వచ్చేసింది. ఈసారి టైటిల్ కొడితే మన తెలుగు వాడే కొట్టాలి అని ఆడియన్స్ సోషల్ మీడియా లో ఒక బలమైన క్యాంపైన్ చేస్తున్నారు. ఆ సత్తా గౌతమ్ లోనే ఉంది కాబట్టి ,అతన్ని ఎలా అయినా గెలిపించాలని బలంగా నిర్ణయించుకున్నారు. అది ఓటింగ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిఖిల్ టాస్కులు అద్భుతంగా ఆడడంలో కింగ్. అతన్ని గౌతమ్ ఈ వారంలో ఒక్కసారి అయినా ఓడిస్తే, ఆయన ఇంకా పెరుగుతుంది. ఇది ఇలా ఉండగా, ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 7 మందిలో యష్మీ, పృథ్వీ రాజ్, విష్ణు ప్రియ, హరితేజ, ఈ నలుగురు కూడా సరిసమైనమైన ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వొచ్చు.