Bigg Boss Telugu 8: టేస్టీ తేజ దూకుడుని తట్టుకోలేకపోయిన నిఖిల్, పృథ్వీ..ఈ ఎపిసోడ్ తో టాప్ 5 లోకి వచ్చినట్టేనా!

టేస్టీ తేజ ఉండే క్లాన్ లో మెహబూబ్, గౌతమ్ లాంటి ఫిజిక్ ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నిఖిల్, పృథ్వీ దూకుడుని తట్టుకోలేకపోయారు. కానీ నిఖిల్, పృథ్వీ మాత్రం ఆ తర్వాతి రౌండ్ లో వచ్చిన టేస్టీ తేజ దూకుడుని తట్టుకోలేకపోయారు.

Written By: Vicky, Updated On : October 25, 2024 8:08 am

Bigg Boss Telugu 8(156)

Follow us on

Bigg Boss Telugu 8: గత సీజన్ లో టేస్టీ తేజ ఒక కమెడియన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి, పెద్దగా టాస్కులు ఆడకపోయినా కూడా కేవలం తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ, 9 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాడు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ ఇప్పటి వరకు ఆడియన్స్ కి ఎప్పుడూ చూపించని సరికొత్త కోణాలను చూపిస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. హౌస్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని ఒక పక్క అందిస్తూనే, మరోపక్క టాస్కుల విషయంలో చిరుత పులి లాగా రెచ్చిపోతున్నాడు. అతని ఫిజిక్ కి నడవడమే ఎక్కువ లాగా చూసేవాళ్లకు అనిపిస్తుంది. కానీ నిన్న ఆయన టాస్కులు ఆడిన తీరుని చూసి, ఇదేమి కసిరా బాబు, టైటిల్ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని వచ్చినట్టు ఉన్నాడు అని అందరికీ అనిపించింది.

టేస్టీ తేజ ఉండే క్లాన్ లో మెహబూబ్, గౌతమ్ లాంటి ఫిజిక్ ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నిఖిల్, పృథ్వీ దూకుడుని తట్టుకోలేకపోయారు. కానీ నిఖిల్, పృథ్వీ మాత్రం ఆ తర్వాతి రౌండ్ లో వచ్చిన టేస్టీ తేజ దూకుడుని తట్టుకోలేకపోయారు. ఇతన్ని ఆపేందుకు వాళ్లద్దరికీ తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా అయ్యింది. మెహబూబ్, గౌతమ్ గోధుమ బస్తాలను కార్ట్ వద్దకు తీసుకొని ఒక్కసారి కూడా రాలేకపోయారు. కానీ టేస్టీ తేజ మాత్రం కార్ట్ వద్దకు తీసుకొచ్చి ఒక్కసారి పెట్టాడు. కానీ దురదృష్టం కొద్దీ పృథ్వీ ముందుగానే కార్ట్ ని ముట్టుకోవడం తో ఆ బస్తా ఓజీ క్లాన్ కి వెళ్ళిపోయింది. మరుసటి రౌండ్ లో కూడా తేజ తన విశ్వరూపం చూపించేసాడు. వేగంగా పరిగెడుతూ పృథ్వీ, నిఖిల్ ని కూడా విసిరివేసాడు. చివరి క్షణం వరకు బస్తా ని వదలకుండా తనవంతు ప్రయత్నం చాలా గట్టిగా చేసాడు. కానీ చివరికి ఆ టాస్క్ మొత్తం ఓజీ క్లాన్ గెలిచారు. బాల్స్ టాస్క్ లో కూడా టేస్టీ తేజా అద్భుతంగా డిఫెండ్ చేసాడు.

సీజన్ 7 లో టేస్టీ తేజ ని అందరూ వీక్ కంటెస్టెంట్ గా చూసేవాళ్ళు. కానీ ఈ సీజన్ లో ఆయన ఇదే దూకుడుతో ఆడితే మాత్రం కచ్చితంగా టాప్ 5 లోకి అడుగుపెడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే నిన్న క్విజ్ గేమ్ జరిగింది. ఈ గేమ్ లో రాయల్ క్లాన్ తరుపున ఆడేందుకు తేజా వస్తాడు. కఠినమైన ప్రశ్నలకు కూడా తన ఇంటెలిజెన్స్ తో చాలా వేగంగా సమాదానాలు చెప్తాడు. అతను చెప్పే సమాదానాలు చూసి నిఖిల్ కూడా ఆశ్చర్యానికి గురి అవుతాడు. టాస్కులు మొత్తం పూర్తి అయ్యాక నిఖిల్ తేజ గురించి మాట్లాడుతూ వాళ్ళ టీం లో టాస్కులు ఆడాలనే కసి తేజ లో ఉన్నంతగా ఎవరిలో లేదు. వాడిని మేము అడ్డుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.