Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్ అవుట్..3 వారాలకు అతను తీసుకున్న రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా?

ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యాడు. అంతే కాదు గతం లో మెహబూబ్, నబీల్ తో తన కమ్యూనిటీ కి సంబంధించిన ఓట్ల గురించి చర్చిస్తాడు. ఇది నేషనల్ లెవెల్ ట్రెండ్ అయ్యి బిగ్ బాస్ కి ఘోరమైన నెగటివిటీ ఏర్పడింది. అప్పటి నుండి బిగ్ బాస్ టీం డేంజర్ జోన్ లోకి వస్తే నబీల్ తీసేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చాడు, ఎలిమినేట్ అయిపోయాడు.

Written By: Vicky, Updated On : October 27, 2024 2:50 pm

Bigg Boss Telugu 8(166)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి మంచి జోష్ తో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు మెహబూబ్. మొదటి వారంలోనే టాస్కులు అద్భుతంగా ఆడి హౌస్ కి మెగా చీఫ్ గా నిలిచాడు. కంటెస్టెంట్స్ అందరితో బాగా కలిసిపోయాడు, ముఖ్యంగా మణికంఠ తో మంచి స్నేహం కూడా చేసాడు ఈయన. అతని ఓట్లు కలిసి వస్తాయనే స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు. సీజన్ 4 లో ఉన్న మెహబూబ్ కి, సీజన్ 8 లో ఉన్న మెహబూబ్ కి చాలా తేడా ఉంది. సీజన్ 4 లో మెహబూబ్ చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. గొడవలు బాగా పెట్టుకునేవాడు, ఎలాంటి స్ట్రాటజీలు ఉపయోగించేవాడు కాదు, చాలా నిజాయితీగా గేమ్ ఆడాడు కాబట్టి ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగాడు. కానీ ఈ సీజన్ లో టాస్కులు బాగానే ఆడుతున్నాడు కానీ, అతని వ్యవహరించే తీరు మొత్తం బయట జనాలను చూసి వచ్చి స్ట్రాటజీ తో ఆడుతున్నట్టు అనిపించింది.

అందుకే ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యాడు. అంతే కాదు గతం లో మెహబూబ్, నబీల్ తో తన కమ్యూనిటీ కి సంబంధించిన ఓట్ల గురించి చర్చిస్తాడు. ఇది నేషనల్ లెవెల్ ట్రెండ్ అయ్యి బిగ్ బాస్ కి ఘోరమైన నెగటివిటీ ఏర్పడింది. అప్పటి నుండి బిగ్ బాస్ టీం డేంజర్ జోన్ లోకి వస్తే నబీల్ తీసేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చాడు, ఎలిమినేట్ అయిపోయాడు. అలా తన ఆట తీరుతో టాప్ 5 వరకు వెళ్లాల్సిన కంటెస్టెంట్ కేవలం మూడు వారాలకే బయటకి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మూడు వారాలకు కలిపి మెహబూబ్ కి కేవలం ఆరు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చారట. అంటే వారానికి రెండు లక్షలు మాత్రమే అన్నమాట. వైల్డ్ కార్డ్స్ లో మిగిలిన వారితో పోలిస్తే మెహబూబ్ పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ని సంపాదించుకోలేదు.

కేవలం ఆయన యూట్యూబ్ లో మ్యూజిక్ వీడియోస్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. ఇంస్టాగ్రామ్ లో మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ, టీవీ ఆడియన్స్ నుండి ఆయనకీ సపోర్టు రాకపోవడం, తన మార్కు ని ఈ మూడు వారాల్లో క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఎలిమినేషన్ రౌండ్ లోకి నయనీ పావని కూడా వచ్చింది. అధికారిక ఓటింగ్ లో తక్కువ ఓట్లు ఆమెకే వచ్చిందట. కానీ కమ్యూనిటీ మీద కామెంట్స్ చేసి తానూ నెగటివ్ అవ్వడమే కాకుండా, షో కి కూడా నెగటివిటీ తీసుకొని రావడం వల్లే మెహబూబ్ ని ఎలిమినేట్ చేసారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంతే కాకుండా ఈ సీజన్ ఆయన కెరీర్ కి కూడా పెద్దగా ఉపయోగపడే అవకాశం లేనట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఇతనికి ఏమైనా ఆఫర్స్ వస్తాయా లేదా అనేది.