https://oktelugu.com/

Venky Atluri: వెంకీ అట్లూరి కి తెలుగు హీరోలు నచ్చడం లేదా..? ఎందుకు ఆయన పర భాష హీరోలతో సినిమాలు చేస్తున్నాడు…

ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా మొన్నటి వరకు తెలుగుకే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టి వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక దానికి తోడుగా రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా స్థాయికి వెళుతున్నాడు. కాబట్టి ఇకమీదట మన తెలుగు సినిమా పరిశ్రమ కూడా వరల్డ్ లెవెల్లో సినిమాలు తీకి సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నారు అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు వాళ్ళు అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 02:54 PM IST

    Venky Atluri

    Follow us on

    Venky Atluri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వెంకీ అట్లూరి లాంటి డైరెక్టర్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో తెలుగు హీరోలతో సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయినా లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన సినిమాలు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ గా తీర్చిదిద్దినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వెంకీ అట్లూరి ఇంతకుముందు ధనుష్ ని హీరోగా పెట్టి సార్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని అందుకుంటారని చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ డైరెక్టర్ తెలుగులో హీరోలు లేనట్టుగా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడం అనేది ఇప్పుడు తెలుగు వాళ్ళకి నచ్చడం లేదు.

    ఎందుకంటే మన తెలుగు సినిమా స్థాయి ని పెంచడానికి ప్రతి ఒక్కరు తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే ఈయన మాత్రం ఇతర భాషల హీరోలతో సినిమాలు చేసి మన వాళ్ళను నెగ్లెట్ చేస్తున్నాడు. తద్వారా మన దగ్గర ఉన్న మీడియం రేంజ్ హీరోలు వెంకీ అట్లూరి సినిమాల్లో నటించలేక పోతున్నారు. కారణం ఏదైనా కూడా వెంకీ అట్లూరి ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ మరికొంతమంది సినీ విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు.

    నిజానికి లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ చేయాల్సిన రోల్ ని మన తెలుగు హీరోల్లో ఎవరినో ఒకరిని పెట్టు చేసిన బాగుండేది కదా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కానీ వెంకీ అట్లూరి మాత్రం తన కథకి దుల్కర్ సల్మాన్ అయితేనే బాగా సెట్ అవుతాడు అందువల్లే అతని తీసుకున్ననని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన తెలుగు హీరోలతో సినిమాలు చేస్తే బాగుంటుందని ఆయనకు మార్కెట్ పెరగడమే కాకుండా మన హీరోలకి కూడా భారీగా మార్కెట్ పెరుగుతుందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…