Bigg Boss Telugu 8: ఈ వారం పాత కంటెస్టెంట్స్ లోపలకు అడుగుపెట్టి హౌస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ మొత్తం ఒక్క రోజే జరిగింది కానీ, చాలా ఫుటేజీ రావడంతో రెండు రోజులు టెలికాస్ట్ చేసారు. హౌస్ లోకి వచ్చిన వాళ్ళు అత్యధిక శాతం మంది ప్రేరణ ని నామినేట్ చేసారు. కారణం మనకి తెలిసిందే. మెగా చీఫ్ అయ్యినప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు లోపల ఉన్న హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు, బయట ఆడియన్స్ కి కూడా అసలు నచ్చలేదు. మొదటి వారం నుండి మెగా చీఫ్ అయ్యేందుకు తపన పడ్డ ప్రేరణ, నేడు సీత ‘ప్రేరణ మళ్ళీ నీకు మెగా చీఫ్ అవ్వాలని ఉందా?’ అని అడగగా, ‘ఆమ్మో నాకు వద్దు..ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’ అని తన నోటితో తానే చెప్పే స్థాయికి పడిపోయింది.
ఆమె భర్త శ్రీపాద్ వచ్చినప్పుడు కూడా ఇదే చెప్తాడు, కానీ ప్రేరణ తన తప్పులను తెలుసుకొని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన వెళ్ళగానే తేజతో దోశల విషయంలో గొడవ పడుతుంది. అంతే కాకుండా గౌతమ్ పై నోరు జారడం, సీత ఫలం విషయం ని సాగదీసి గౌతమ్ ని చెడు చేయాలని చూడడం, అసలు ఈ గౌతమ్ ఎలా సేవ్ అవుతున్నాడు రా బాబు అని నబీల్, యష్మీ వద్ద తన అసూయ ని వ్యక్తం చేయడం, రోహిణి కి సహాయం చేస్తున్నట్టుగా నటించి ఆమెకు వెన్నుపోటు పొడవడం, ఇలా ఒక్కటా రెండా, ఎన్నో నెగటివ్ పాయింట్స్ ఇచ్చింది. వీటి అన్నిటిని నామినేట్ చేయడానికి వచ్చిన పాత కంటెస్టెంట్స్ పెట్టి ప్రేరణ ని నిలదీయడంతో ఆమె మానసికంగా చాలా డౌన్ అయిపోయింది. ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోని ప్రేరణ, సోఫా లో పడుకొని ఏడుస్తూ కూర్చుంది.
ఇది గమనించిన అవినాష్, గౌతమ్ వెంటనే ప్రేరణ వద్దకు వచ్చి ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసారు. గౌతమ్ ని ప్రేరణ మొదటి నుండి శత్రువుగానే చూస్తుంది. అవినాష్ తో స్నేహం గా ఉంటూనే అతన్ని ఎందుకు ఎలిమినేషన్ నుండి సేవ్ చేసావు అంటూ నబీల్ తో మాట్లాడుతుంది. అయినప్పటికీ కూడా వాళ్లిద్దరూ ఈమె పట్ల చూపించిన నిజమైన జాలి ఏదైతే ఉందో, అది నిజంగా చాలా బాగా అనిపించింది. అయితే ప్రేరణ ఇంత మంది తన మెగా చీఫ్ పని తీరుని బాలేదు అన్నారంటే, కచ్చితంగా తప్పు చేశాను అనే అనుకుంటున్నాను అని చెప్పి, అందరిని కూర్చోబెట్టి పేరుపేరున క్షమాపణలు చెప్తుంది. దానికి గౌతమ్ కూడా ఎమోషనల్ అయ్యి ప్రేరణ ని హాగ్ చేసుకుంటాడు. ఇక రేపటి నుండి ప్రేరణ తన తీరుని మార్చుకొని ఎలా ఆడబోతుందో చూడాలి.