Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో తన రెమ్యూనరేషన్ గురించి నోరుజారిన మణికంఠ.. అడ్డంగా దొరికిపోయాడుగా!

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇది లైవ్ టెలికాస్ట్ లో కనిపించిన వీడియో, సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేస్తేనే తెలిసింది. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ సంభాషణ చూపించలేదు. కాబట్టి నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో దీని గురించి మాట్లాడకపోవచ్చు, కానీ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, యూట్యూబ్ లో రివ్యూయర్స్ కూడా ఈ అంశం పై ఏకిపారేస్తున్నారు.

Written By: Vicky, Updated On : October 16, 2024 2:48 pm

Bigg Boss Telugu 8(121)

Follow us on

Bigg Boss Telugu 8: గత తెలుగు బిగ్ బాస్ సీజన్స్ లో రూల్స్ చాలా కఠినంగా ఉండేవి. నామినేషన్స్ గురించి మిగిలిన సమయాల్లో మాట్లాడుకోకూడదు, బయట విషయాలను చర్చించుకోకూడదు, అలాగే బిగ్ బాస్ తో చేసుకున్న ఒప్పందాల గురించి అసలు మాట్లాడుకోకూడదు. అది కేవలం సదరు కంటెస్టెంట్ కి, యాజమాన్యం కి మధ్య ఉండే డీల్. అయితే ఈ సీజన్ లో అలాంటి రూల్స్ కంటెస్టెంట్స్ ఎవ్వరూ పాటించడం లేదు. హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూసే వారికి ప్రతీ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న బొక్కలు తెలుస్తూనే ఉన్నాయి. నామినేషన్స్, ఓటింగ్ గురించి అసలు మాట్లాడడం రూల్స్ కి విరుద్ధం అని అంటుంటే, నిన్న నభీల్, మహబూబ్ ఏకంగా తమ ముస్లిం కమ్యూనిటీ ఓటింగ్ గురించి మాట్లాడడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇది లైవ్ టెలికాస్ట్ లో కనిపించిన వీడియో, సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేస్తేనే తెలిసింది. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ సంభాషణ చూపించలేదు. కాబట్టి నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో దీని గురించి మాట్లాడకపోవచ్చు, కానీ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, యూట్యూబ్ లో రివ్యూయర్స్ కూడా ఈ అంశం పై ఏకిపారేస్తున్నారు. కాబట్టి కచ్చితంగా మాట్లాడాలి, వాస్తవానికి ఇది బిగ్ బాస్ ప్రతిష్టకు భంగం కలిగించే అంశం, కచ్చితంగా వీళ్లిద్దరికీ రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపాలి, ఆ స్థాయిలో ఫైర్ అవ్వాల్సిన అంశం ఇది, నాగార్జున ఎలా డీల్ చేస్తాడో చూడాలి. అలాగే నేడు మణికంఠ కూడా సరదాగా తన తోటి హౌస్ మేట్స్ తో మాట్లాడుతున్న సమయం లో రెమ్యూనరేషన్ గురించి నోరు జారేస్తాడు. గంగవ్వ, హరితేజ, నభీల్, పృథ్వీ, మణికంఠ ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.

నభీల్ గంగవ్వ తో మాట్లాడుతున్న సమయం లో మణికంఠ మధ్యలో కలగచేసుకొని ‘నాకు వారానికి వచ్చేదే లక్ష..ఎక్కడ సరిపోతుంది చెప్పు’ అని అంటాడు. దానికి హరితేజ పక్కన కూర్చొని ఇలా బయటకి చెప్పేశాడేంటి అని షాకింగ్ రియాక్షన్ ఇస్తుంది. ఇలా హౌస్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న యష్మీ ప్రేరణ కి నామినేషన్స్ వేసే విషయం, ఆ ప్రక్రియ ప్రారంభం కాకముందే టేస్టీ తేజా తో చెప్తుంది, ఆ తర్వాత నేరుగా ప్రేరణకే చెప్తుంది. కేవలం యష్మీ మాత్రమే కాదు, హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నాగార్జున ఇన్ని రోజులు వాటి గురించి ప్రశ్నించలేదు, హోస్ట్ గా ఈ విషయం లో ఆయన డిజాస్టర్ అయ్యినట్టే. ఈ వారం హౌస్ మేట్స్ రూల్స్ కి విరుద్ధంగా ఇన్ని చేసారు, దీనికి ఆయన వైపు నుండి కనీసం ఈ వారం అయినా రియాక్షన్ వస్తుందో లేదో చూడాలి.