https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అవినాష్ పై పగబట్టేసిన కన్నడ బ్యాచ్..నిఖిల్ నామినేట్ చేసినందుకు యష్మీ నాన్ స్టాప్ ఏడుపులు!

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అవినాష్ మెగా చీఫ్ అయ్యినందుకు గాను ఒకరిని నామినేషన్స్ నుండి సేఫ్ చేసి, సేఫ్ గా ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరినో ఒకరిని నామినేషన్స్ లోకి పంపాలని బిగ్ బాస్ చెప్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 07:43 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: గత రెండు వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ నెగెటివిటీ జరుగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. వీళ్ళతో ఉన్నందుకు బాగా ఆడుతున్న ప్రేరణ కూడా నెగటివిటీ ని మూటగట్టుకుంటుంది. ముఖ్యంగా యష్మీ అయితే పూర్తిగా ట్రాక్ తప్పింది. వరుసగా ఆమెకి నెగటివ్ ఎపిసోడ్స్ పడుతూనే ఉన్నాయి. టాప్ 5 లో కచ్చితంగా ఉండేందుకు అర్హతలు ఉన్న కంటెస్టెంట్. కానీ నిఖిల్ మీద పిచ్చి తో గేమ్ మొత్తం చేతులారా నాశనం చేసుకుంది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమె డేంజర్ జోన్ లో ఉంది అంటేనే అర్థం చేసుకోవచ్చు, యష్మీ ఏ రేంజ్ లో తన గేమ్ ని పాడు చేసుకుంది అనేది. ఇక ఈరోజు ఈమెను చూసిన తర్వాత ఈమె కంటే విష్ణు ప్రియ చాలా బెటర్ అని అందరికీ అనిపించింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అవినాష్ మెగా చీఫ్ అయ్యినందుకు గాను ఒకరిని నామినేషన్స్ నుండి సేఫ్ చేసి, సేఫ్ గా ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరినో ఒకరిని నామినేషన్స్ లోకి పంపాలని బిగ్ బాస్ చెప్తాడు. దీనికి అవినాష్ రోహిణి ని నామినేషన్స్ నుండి తప్పించి, నిఖిల్ ని నామినేషన్స్ లోకి తోస్తాడు. దీనికి నిఖిల్ కంటే ఎక్కువగా యష్మీ ఫీల్ అయిపోయింది. నిఖిల్ సరదాగా అవినాష్ తో మాట్లాడుతూ నన్ను ఎందుకు నామినేషన్స్ లోకి వేశావు రా బాబు అని అంటాడు. అప్పుడు యష్మీ మధ్యలో కల్పించుకొని మాట్లాడుతూ ‘నువ్వు రోహిణి ని సేవ్ చేయడం చాలా తప్పు అనిపించింది. రోహిణి కంటే నిఖిల్ గత వారం అన్ని టాస్కులు బాగా ఆడాడు, నువ్వు కేవలం నిఖిల్ మా మీద కోపం తెచ్చుకొని అలా ఆడాడు అని నామినేట్ చేసావు. నేను, ప్రేరణనే నిఖిల్ ని నామినేట్ చేయలేదు. ఎందుకంటే మాకు తెలుసు ఆరోజు అక్కడ పరిస్థితులు ఏమిటి అనేది. నిఖిల్ తప్పు ఏమి లేదు అనే మేము చేయలేదు’ అని అంటుంది.

    దానికి అవినాష్ కౌంటర్ ఇస్తూ ‘మరి సంచాలక్ ఆపమని చెప్పినప్పుడు ఆరోజే చెప్పొచ్చు కదా..పర్వాలేదు ఇదంతా గేమ్ అని..ఇప్పుడు నాకు ఎందుకు ఇదంతా చెప్తున్నావ్’ అని అంటాడు. దానికి యష్మీ సమాధానం చెప్తూ ‘ప్రతీ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నామినేట్ చేసే ముందు నీ తప్పుని తెలుసుకొని ఉండుంటే బాగుండేది. ఒక మూడవ వ్యక్తిగా నేను నా మెగా చీఫ్ ఎలా ఉన్నాడు, బయాస్ గా ఉన్నాడా లేదా అనేది చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. వాటర్ టాస్క్ లో నిఖిల్ తప్పు ఏమి లేదని, యష్మీ నే స్వయంగా చెప్తుంది. కానీ ఈ టాస్కుని చూసి ఈమెకి సపోర్ట్ చేసిన జనాలు, విశ్లేషకులు అందరి ఎర్రోళ్ళు అయ్యినట్టే కదా. ప్రేరణ చాలా తెలివిగా మేము తప్పు చేసాము అని ఒప్పుకుంది. కానీ ఇక్కడ యష్మీ మాత్రం నిఖిల్ కోసం తలదూర్చి నెగటివ్ అయిపొయింది. ప్రస్తుతం నిఖిల్, గౌతమ్ మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. యష్మీ కి ఇన్ని రోజులు ఓట్లు వేస్తూ వచ్చినవాళ్లు కూడా ఈమె ఎలాగో నిఖిల్ కోసమే ఆడుతుంది, ఈమెకి ఎందుకు ఓట్లు వేయడం నిఖిల్ కి వేద్దాం అని ఆయనకే వేసే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి ఈ వారం ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ.