https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ ని అందరూ టార్గెట్ చేస్తున్నారు అంటూ ఏడ్చేసిన గంగవ్వ..కన్నడ బ్యాచ్ మీద కోపంతో సెల్ఫ్ ఎలిమినేషన్?

గౌతమ్ కి జనాల్లో ప్రేక్షకాదరణ దక్కింది కానీ, హౌస్ లో మాత్రం పాపం ఇతనికి ఆదరణ దక్కడం లేదు. ప్రతీ ఒక్కరు ఇతన్ని టార్గెట్ చేస్తూ ఎలా అయిన ఓడించి బయటకి పంపించాలి అనే కసితోనే ఉన్నారు. ఒక్క టేస్టీ తేజ ఒక్కడే నిజాయితీగా గౌతమ్ కి సపోర్టు చేస్తూ వచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 07:38 AM IST

    Bigg Boss Telugu 8(203)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ ప్రారంభం లో హౌస్ మేట్స్ అందరూ మణికంఠ ని ఎలా అయితే టార్గెట్ చేసారో, ఇప్పుడు వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్ పై కూడా అలాగే టార్గెట్ చేసారు. మణికంఠ అమాయకుడు కాబట్టి వీళ్ళను తట్టుకోలేక బయటకి వెళ్ళిపోయాడు. కానీ గౌతమ్ మామూలోడు కాదు కదా, గత సీజన్ లో శివాజీ లాంటి మాస్టర్ మైండ్ గేమ్ ఉన్నోడినే ఎదురుకున్నాడు, ఇప్పుడు ఉన్నోళ్లు ఎంత, కన్నడ బ్యాచ్ గేమ్,వాళ్ళు వేసుకున్న మాస్కులు మొత్తాన్ని బయట జనాలకు చూపించేసాడు. మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఎలిమినేట్ అయ్యి, మణికంఠ కారణంగా సేఫ్ అయిన గౌతమ్, తన అద్భుతమైన ఆట తీరు, ప్రవర్తనతో ప్రేక్షకుల అభిమానం ని సంపాదించుకొని, ఇప్పుడు ఓటింగ్ లో నిఖిల్ తో సమానంగా పోటీ పడుతున్నాడు.

    గౌతమ్ కి జనాల్లో ప్రేక్షకాదరణ దక్కింది కానీ, హౌస్ లో మాత్రం పాపం ఇతనికి ఆదరణ దక్కడం లేదు. ప్రతీ ఒక్కరు ఇతన్ని టార్గెట్ చేస్తూ ఎలా అయిన ఓడించి బయటకి పంపించాలి అనే కసితోనే ఉన్నారు. ఒక్క టేస్టీ తేజ ఒక్కడే నిజాయితీగా గౌతమ్ కి సపోర్టు చేస్తూ వచ్చాడు. కష్ట సమయంలో ఒక స్నేహితుడిగా అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ జాబితా లోకి గంగవ్వ కూడా చేరింది. గౌతమ్ గేమ్స్ బాగా ఆడుతున్నప్పటికీ అందరూ అతన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ బాధపడిన గంగవ్వ, ఇదే విషయంలో యష్మీ ని కూడా ఈ వారం లో నామినేషన్ వేసింది. ఇక నిన్న జరిగిన టాస్కులో గౌతమ్, నభీల్ పోటీ పడితే హౌస్ మేట్స్ అందరూ నభీల్ కి ప్రోత్సాహం ఇచ్చారు కానీ, గౌతమ్ కి ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఒక్కరైనా నా కోసం అరవండి రా అని గౌతమ్ అడుగుతాడు. ఇదంతా చూసిన గంగవ్వ చాలా బాధపడుతుంది.

    గంగవ్వ బాధపడడంని చూసిన గౌతమ్, ఆమె వద్దకు వెళ్లి, ఏమి పర్వాలేదు గంగవ్వ, హౌస్ మేట్స్ అందరూ నాకు సపోర్టు చేయకపోయినా పర్వాలేదు, నువ్వు చేస్తున్నావు కదా, అది చాలు నాకు అని అంటాడు. ఆ తర్వాత గౌతమ్ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని అన్నం తింటుండగా, గంగవ్వ అతని వద్దకి వచ్చి ప్రేమగా కౌగలించుకొని వెళ్తుంది. అసలే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గంగవ్వ ని ఈ వారం బిగ్ బాస్ టీం బయటకి పంపే అవకాశం ఉంది. అంతే కాకుండా గౌతమ్ ఒకసారి డేంజర్ జోన్ లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి రావడాన్ని చూసిన గంగవ్వ, మళ్ళీ అతనికి ప్రమాదం ఉందేమో అని భయంతో, గౌతమ్ కోసం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఈ వీకెండ్ లో ఏమి జరగబోతుందో అనేది.ప్రస్తుతం ఓటింగ్ లో గౌతమ్ అందరికంటే టాప్ స్థానం లో ఉన్నాడు. ఈ విషయం లో హౌస్ లో ఉన్నవాళ్లకు తెలియదు. తెలిసిన రోజు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.