https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నభీల్, పృథ్వీ దొంగాటలకు బిగ్ బాస్ చెక్..నభీల్ కి నిఖిల్ సహాయం.. పులిలా ఆడిన గౌతమ్!

మొదటి నాలుగు వారాల్లో మనకి కనిపించిన నభీల్ ఇతను కాదే, ఇలా మారిపోయాడేంటి అని ఈయనకి మొదటి నుండి ఓట్లు వేస్తూ వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్ బాస్ గార్డెన్ ప్రాంతం లో మూడు సూట్ కేసులు పెడుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 07:47 AM IST

    Bigg Boss Telugu 8(205)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ ప్రారంభం నుండి హౌస్ మేట్స్ అందరూ ఓపెన్ గా గ్రూప్ గేమ్స్ ఆదుకోవడం మనమంతా చూస్తూనే ఉన్నాం. గత సీజన్స్ లో గ్రూప్ గేమ్స్ ఆడితే పెద్ద పాపం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తిగా సిగ్గు వదిలేసారు. ముఖ్యంగా నభీల్ ఇంత సేఫ్ గేమ్స్ ఆడుతాడని ఆయన్ని అభిమానించేవాళ్ళు కూడా ఊహించలేకపోయారు. ముఖ్యంగా నామినేషన్స్ అంటే భయపడుతున్నాడు. ఇక టాస్కుల విషయానికి వస్తే తనకంటే బలహీనుల దగ్గరకి వెళ్లి కూడా డీలింగ్స్ పెట్టుకుంటున్నాడు. మొదటి నాలుగు వారాల్లో మనకి కనిపించిన నభీల్ ఇతను కాదే, ఇలా మారిపోయాడేంటి అని ఈయనకి మొదటి నుండి ఓట్లు వేస్తూ వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్ బాస్ గార్డెన్ ప్రాంతం లో మూడు సూట్ కేసులు పెడుతాడు.

    ఈ మూడు సూట్ కేసులను రోహిణి, పృథ్వీ, నభీల్ తీసుకొని మెగా చీఫ్ కంటెండర్లు అవుతారు. అయితే తమ కంటెండర్ షిప్ ని కాపాడుకునేందుకు కొన్ని టాస్కులు ఆడాల్సి ఉంటుంది. మొదటి టాస్క్ రోహిణి ఆడాలని ఫిక్స్ అవుతుంది. బిగ్ బాస్ ఆమెకు ఎవరిని పోటీనో ఎంచుకొని చెప్పమంటాడు. రోహిణి హరి తేజ ని ఎంచుకుంటుంది. ఇద్దరు టాస్క్ బాగా ఆడుతారు కానీ, చివరికి రోహిణి గెలుస్తుంది. ఆ తర్వాత సూట్ కేసు ని ప్రేరణకి ఇచ్చి ఆమెని మెగా చీఫ్ కంటెండర్ ని చేస్తుంది. ఇక తదుపరి టాస్క్ లో కూడా ఇలాగే ఉంటుందని నభీల్, పృథ్వీ తో ఒక డీలింగ్ పెట్టుకుంటాడు. వీళ్లిద్దరు కలిసి యష్మీ ని పిలిచి ఆమెతో కూడా డీలింగ్ పెట్టుకుంటారు. తదుపరి టాస్క్ లో పృథ్వీ నిన్ను తనకి ప్రత్యర్థి గా ఎంచుకుంటాడు. అది ఎలాంటి గేమ్ అయినా నువ్వు ఓడిపోవాలి, ఓడితే మనోడు నీకు సూట్ కేసు ఇస్తాడు అని అంటాడు.

    ఇదే డీల్ ని నభీల్ తేజతో కూడా పెట్టుకుంటాడు. ఇలా పక్కా స్క్రిప్ట్ తో ముందుకు పోవాలని సిద్దమైన ఈ ముగ్గురికి బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. పృథ్వీ, నభీల్, రోహిణి కాకుండా మిగిలిన అందరూ టేబుల్ మీద పెట్టిన గంటని ఎవరైతే ముందుకు పెట్టుకుంటారో, వాళ్ళు పృథ్వీ, నభీల్ లలో ఎవరితో పోటీ పడాలో ఎంచుకుంటారు అని అంటాడు బిగ్ బాస్. ఈ చిన్న టాస్క్ లో గౌతమ్ అందరి కంటే ముందు గంటని పట్టుకుంటాడు. ఆ తర్వాత నభీల్ తో పులి లా తలపడి ఆడుతాడు. హౌస్ మేట్స్ అందరూ నభీల్ ని ప్రోత్సహిస్తూ అరవగా, గౌతమ్ ని ఒక్కరు కూడా సపోర్టు చేయరు. మరోపక్క నిఖిల్ నభీల్ కి ఇన్పుట్స్ అందిస్తూ ఉన్నాడు. మొదటి రౌండ్ డ్రా అవుతుంది, రెండవ రౌండ్ లో జస్ట్ ఒక్క సెకండ్ గ్యాప్ లో నభీల్ గెలుస్తాడు. అయితే ఇక్కడ నభీల్ కి హౌస్ మేట్స్ అందరి సపోర్ట్ ఉంది, గౌతమ్ కి ఎవరు లేకపోయినా తన సొతంగా ఆడి చివరి వరకు వచ్చాడు.