https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఈరోజు జరిగే నామినేషన్స్ లో టేస్టీ తేజని దారుణంగా టార్గెట్ చేసిన కన్నడ బ్యాచ్..ఈ దెబ్బతో టాప్ 5 స్థానం ఖరారు అయ్యినట్టే!

తేజ ఏ తప్పు చేయకపోయినా ఎదో ఒక సిల్లీ పాయింట్ ని తీసి అతన్ని నామినేట్ చేయాలని చూస్తూ ఉంటుంది కన్నడ బ్యాచ్. ఇక తేజ వాళ్లకి నామినేషన్స్ వేసేంత పాయింట్స్ ఇస్తే చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 07:58 AM IST

    Bigg Boss Telugu 8(214)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన టేస్టీ తేజ ఆడియన్స్ ఎంతో సర్ప్రైజ్ చేసాడు. గత సీజన్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే అందిస్తూ 9 వారాలు హౌస్ లో కొనసాగిన టేస్టీ తేజ, ఈ సీజన్ లో మాత్రం తన శరీరం సహకరించకపోయినా కూడా టాస్కులు అద్భుతంగా ఆడాడు. అంతే కాకుండా అతను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితాలు రాకపోవడం వంటివి తేజ మీద ఆడియన్స్ లో సానుభూతి పెంచింది. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున అసలు తేజ ని గుర్తించకపోవడం, అతని ఆట తీరుని మెచ్చుకోకపోవడం వంటివి తేజ కి ప్లస్ అయ్యింది. అంతే కాకుండా తేజ నామినేషన్స్ సమయం లో తీసుకొచ్చే పాయింట్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది . మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఈయన , ఆ వారమే హౌస్ నుండి వెళ్ళిపోవాలి, కానీ నామినేషన్స్ అతను వినిపించిన బలమైన పాయింట్స్ కారణంగా ఆడియన్స్ అతని తెలివికి ఫిదా అయ్యి సేవ్ చేసారు.

    తేజ ఏ తప్పు చేయకపోయినా ఎదో ఒక సిల్లీ పాయింట్ ని తీసి అతన్ని నామినేట్ చేయాలని చూస్తూ ఉంటుంది కన్నడ బ్యాచ్. ఇక తేజ వాళ్లకి నామినేషన్స్ వేసేంత పాయింట్స్ ఇస్తే చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. గత వారం ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ తేజ తొందరపాటు వల్లే రద్దు అయ్యింది. ఈ పాయింట్ తోనే నిఖిల్ తేజని నామినేట్ చేసాడు. యష్మీ , విష్ణు ప్రియ వంటి వారు కూడా తేజకే నామినేషన్ వేసి ఉంటారు. ఈ పాయింట్ కి తేజ తనని తాను సమర్ధించుకోవడానికి పాయింట్స్ లేవు. మౌనంగా వాళ్ళ పాయింట్స్ ని అంగీకరించి నామినేషన్స్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి. అయితే తేజ మాత్రం అలా సైలెంట్ అయ్యే రకం కాదుగా, నిఖిల్ తో ఈ పాయింట్ మీద పెద్ద గొడవ పెట్టుకుంటాడు. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను, నీ స్నేహితురాలు యష్మీ కూడా అదే తప్పు చేసింది కదా, ఆమెని ఎందుకు నామినేట్ చేయలేదు అని ప్రశ్నించాడు.

    ఈ విషయంలో ఆయన బలంగా గొంతు లేపి మాట్లాడడం నిన్న ఎపిసోడ్ చివర్లో వేసిన మినీ ప్రోమోలో చూడొచ్చు. ఇక్కడ తేజదే తప్పు అనొచ్చు. ఎందుకంటే ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ టాస్క్ లో ముందుగా తప్పు చేయడం మొదలు పెట్టింది టేస్టీ తేజ. కేవలం ఒకరికే నామినేషన్ వేయాలి కాబట్టి తేజకే వేస్తారు. ఇక్కడ ఆయన తనని తానూ డిఫెండ్ చేసుకోవడం ఎందుకో కరెక్ట్ కాదు అనిపించింది. అయితే ఈ వారం టేస్టీ తేజ నామినేషన్స్ లోకి వచ్చినప్పటికీ, నూటికి నూరు శాతం అతను సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత కొంతకాలంగా తేజ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది, కేవలం నామినేషన్స్ లో సేవ్ అవ్వడమే కాదు, టాప్ 5 లోకి అతను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.