Bigg Boss Telugu 8: సంచాలక్ గా యష్మీ సక్సెస్ అయ్యిందా..లేదా ఫెయిల్ అయ్యిందా? వీడియోతో సహా దొరికిపోయిందిగా!

కొంతమంది యూట్యూబర్స్ కూడా అదే చేస్తున్నారు. తప్పు చేసినప్పుడు విమర్శించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఏమి చేసినా తప్పు అని నెగటివిటీ చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పు అనే చెప్పాలి. యష్మీ విషయం లో నిన్న అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, స్లైడ్ స్లోప్ నుండి లోపలకి వచ్చే గోధుమ బస్తాలను ఇరు క్లాన్స్ కి చెందిన కంటెస్టెంట్స్ అందుకొని, తమకు చెందిన కార్ట్స్ లో పెట్టాలి.

Written By: Vicky, Updated On : October 25, 2024 9:17 am

Bigg Boss Telugu 8(159)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న బిగ్ బాస్ హౌస్ లో జరిగిన బస్తాల టాస్క్ ఎంత హోరాహోరీగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాస్క్ కి సంచాలక్ గా యష్మీ వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనేకమంది యష్మీ సంచాలక్ గా ఫెయిల్ అయ్యింది అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని పీఆర్ టీమ్స్ అయితే యష్మీ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా?, ఆమెని పూర్తిగా నెగటివ్ చేద్దామా అని ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్ కూడా అదే చేస్తున్నారు. తప్పు చేసినప్పుడు విమర్శించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఏమి చేసినా తప్పు అని నెగటివిటీ చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పు అనే చెప్పాలి. యష్మీ విషయం లో నిన్న అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, స్లైడ్ స్లోప్ నుండి లోపలకి వచ్చే గోధుమ బస్తాలను ఇరు క్లాన్స్ కి చెందిన కంటెస్టెంట్స్ అందుకొని, తమకు చెందిన కార్ట్స్ లో పెట్టాలి.

ఈ టాస్క్ ఆడేందుకు ముందుగా ఓజీ క్లాన్ నుండి గౌతమ్, మెహబూబ్ వస్తారు. వాళ్లకి దెబ్బలు తగలడంతో ఆ తర్వాత రౌండ్ లో అవినాష్, టేస్టీ తేజా వచ్చి ఆడుతారు. అయితే టేస్టీ తేజ ఒక రౌండ్ లో నిఖిల్, పృథ్వీ ని తప్పించుకొని కార్ట్స్ దగ్గరకి బస్తాని తీసుకెళ్తాడు. కానీ పృథ్వీ ఆ బస్తాని తన కార్ట్ కి ఒకసారి తగిలిస్తాడు, ఆ తర్వాత అవినాష్ వచ్చి పృథ్వీ చేతుల్లో నుండి బస్తాని లాగి తమ కార్ట్ లో వేస్తాడు. దీనికి యష్మీ నో చెప్తుంది. ఎందుకంటే ఆమె కార్ట్ కి బస్తాని తాకించినా కూడా పరిగణలోకి తీసుకుంటాను అని ముందే చెప్తుంది. పృథ్వీ ముందుగా ఆ పని చేయడంతో ఆమె ఓజీ క్లాన్ కి సంబంధించిన కార్ట్ లోకి బస్తా ని వేస్తుంది. దీనికి రాయల్ క్లాన్ వాళ్ళు ఒప్పుకోరు. ఇది అన్యాయం మాకు ఆ రూల్ ముందుగా చెప్పలేదని యష్మీ తో వాదిస్తారు. కానీ యష్మీ నిజంగానే చెప్తుంది. టాస్క్ ప్రారంభం అయ్యే ముందు బస్తాని కార్ట్స్ లో వేస్తేనే కాదు, కార్ట్స్ కి తాకించినా కూడా నేను పరిగణలోకి తీసుకొని పాయింట్స్ ఇస్తాను అని అంటుంది.

ఈ మాటని రాయల్ క్లాన్ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. ఫలితంగా తేజ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. అయితే యష్మీ తప్పు ఏమి లేదని అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి. వీకెండ్ లో నాగార్జున కూడా దీనిపై గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది, రాయల్ క్లాన్ కి వీడియో చూపించి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే యష్మీ టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత పృథ్వీ తో మాట్లాడుతూ నేను సంచాలక్ అయినప్పటికీ నా క్లాన్ కి సపోర్టుగా ఉండే రూల్స్ పెడుతా, అది నా ఇష్టం అంటూ మాట్లాడుతుంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది కానీ, టీవీ టెలికాస్ట్ లో ప్రసారం కాలేదు.