Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నిగ్రహాల్లో మార్పుల వల్ల ఆయా రాశుల వారి జీవితాల్లో మార్పులు ఉంటాయి. శుక్రవారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషంతో సహా మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
కుటుంబ సభ్యుల అవసరాల తీర్చడానికి కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
వ్యాపారుల్లో కష్టపడిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. కొత్త పనిని ప్రారంభించే వారికి అనుకూల సమయం. పిల్లల చదువు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మిథున రాశి:
బంధువుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. శారీరకంగా అలసి పోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి:
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.
సింహారాశి:
వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండిపోతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కన్య రాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాన్ని మార్చుకోవాలని అనిపిస్తే ఇదే మంచి సమయం. వ్యాపారులు భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. ఉద్యోగులు సీనియర్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.
తుల రాశి:
అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవత భాగస్వామితో వాదనలు ఉంటాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం అయితే వారితో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడుతారు. సంబంధాల్లో చీలికలు ఏర్పడుతాయి. శత్రువులపై కన్నేసి ఉంచాలి.
ధనస్సు రాశి:
కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాదనలకు దూరంగా ఉండాలి.
మకర రాశి:
ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. బంధువల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మీకు ఇష్టమైన పనిని మాత్రమే చేయాలి.
కుంభరాశి:
కష్టపడిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనరాశి:
కోపాన్ని అదుపులో ఉంచాలి. జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.