Prabhas: ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద హీరో. ఆయనతో మూవీ చేయాలంటే కనీసం రూ. 500 కోట్లు కావాలి. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD బాక్సాఫీస్ షేక్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా కల్కి ఉందని పలువురు చిత్ర ప్రముఖులు కొనియాడారు. కల్కి మూవీలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేయడం విశేషం.
కల్కి చిత్రానికి కొనసాగింపుగా పార్ట్ 2 రానుంది. మొదటి భాగంలో పాత్రలను, ఆ ప్రపంచాన్ని పరిచయం చేశాను. అసలు కథ రెండో భాగంలో ఉందని ఆయన అంటున్నారు. ప్రభాస్ ని గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. నాగ్ అశ్విన్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ జరుపుకుంటుంది. కల్కి 2, సలార్ 2 చిత్రాలు చేయాల్సి ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేశాడు.
ప్రభాస్-హను రాఘవపూడి మూవీ వర్కింగ్ టైటిల్ ఫౌజి అని సమాచారం. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి యాక్షన్ లవ్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. ఇమాన్వి అనే ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేయడం విశేషం. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది.
మరోవైపు ప్రభాస్ అభిమానులు ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ ఆహార ప్రియుడన్న సంగతి తెలిసిందే. ఆయన వద్ద ఓ చెఫ్ టీమ్ పని చేస్తుంది. ఇక ప్రభాస్ ఇంట్లో ఓ నాన్ వెజ్ ఐటెం చాలా స్పెషల్ అట. అది బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అట. ఈ వంటకం అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం కాగా… తన ఇంటికి వచ్చిన అతిథులకు తప్పకుండా రుచి చూపిస్తారట. అలాగే రొయ్యల పులావ్ కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారట.